AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashveer Goud: పాక్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న తెలంగాణ కుర్రాడు.. తన సెలబ్రేషన్స్‌పై ఏమన్నాడంటే?

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా మన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఆ పేరును తెగ కలవరిస్తున్నారు. ఇంతకీ ఆ పేరు ఎవరిదో తెలుసా? తెలంగాణకు చెందిన ఓ తెలుగు కుర్రాడిది. ఇటీవల జరిగిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ అండర్-19 మ్యాచ్‌లో విజయం తర్వాత అతడు చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

Yashveer Goud: పాక్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న తెలంగాణ కుర్రాడు.. తన సెలబ్రేషన్స్‌పై ఏమన్నాడంటే?
Yashveer Goud Viral Celebration
Anand T
|

Updated on: Nov 18, 2026 | 5:15 PM

Share

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఎక్కడలేని ఉత్కంఠ. అది సీనియర్ల మ్యాచ్ అయినా, జూనియర్ల మ్యాచ్ అయినా అదే స్థాయిలో ఆసక్తి ఉంటుంది. ఇటీవల జరిగిన భారత్ వర్సెస్ పాకిస్థాన్ అండర్-19 మ్యాచ్ కూడా అలాగే సాగింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా ఆటగాళ్లు.. గెలుపు తర్వాత చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టులోని తెలంగాణ కుర్రాడు యశ్వీర్ గౌడ్.. పాక్ ప్లేయర్లకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌ను భారత క్రికెట్ అభిమానులు సైతం తెగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిన తర్వాత.. తెలుగోడంటే ఆ మాత్రం ఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యశ్వీర్ అంతలా స్పందించడానికి ఓ కారణం ఉంది.

అసలు ఏం జరిగింది?

అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో దీపావళి రోజున భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారత్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 208 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ ఆ స్కోరును అధిగమించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఓ పాక్ ఆటగాడు అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు యశ్వీర్ వెల్లడించాడు. కానీ అప్పుడు తాము ఓటమి పాలవడంతో ఏమీ మాట్లాడలేకపోయామని.. అందుకు సమాధానం ఫైనల్లో చెప్పాలని ఎదురుచూసినట్లు తెలిపాడు.

ఫైనల్లో రిటర్న్ గిఫ్ట్!

ఇక ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తొలుత ఓడిపోతుందేమోనని అనిపించినప్పటికీ.. ఆ తర్వాత అద్భుతమైన ఆటతీరుతో నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఘన విజయం సాధించింది. దీపావళి రోజున పాకిస్థాన్ ఆటగాళ్లు చేసిన హడావుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న యశ్వీర్ గౌడ్.. విజయం తర్వాత మైదానంలో తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. దీపావళి మ్యాచ్‌లో పాక్ ఆటగాడు ఎలా ప్రవర్తించాడో.. ఫైనల్ విజయం తర్వాత అదే విధంగా స్పందించాడు. ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ వీడియో వైరల్ కావడంతో యశ్వీర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు.

పోస్ట్ చూడండి..

తన సెలబ్రేషన్స్‌పై యశ్వీర్ ఏమన్నాడంటే?

తన సెలబ్రేషన్స్‌పై యశ్వీర్ గౌడ్ స్పందిస్తూ.. వాళ్లు గతంలో ఎలా ప్రవర్తించారో మేము కూడా అలాగే చేశాం. వాళ్లు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మేము కూడా నిశ్శబ్దంగానే ఉన్నాం. మా జెర్సీపై భారతదేశం పేరు ఉంది. ఈ క్షణం కోసం మేమంతా ఎదురుచూశాం. అందుకే ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు అని వివరించాడు.

పోస్ట్ చూడండి..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాక్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న తెలుగు కుర్రాడు
పాక్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న తెలుగు కుర్రాడు
చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..
చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..
ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలా? ప్రభుత్వం శుభవార్త
ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలా? ప్రభుత్వం శుభవార్త
ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు.. మలయాళ మూవీస్ ఇచ్చే అసలైన కిక్ ఇదే..
ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు.. మలయాళ మూవీస్ ఇచ్చే అసలైన కిక్ ఇదే..
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు? విష్ణుమూర్తి, శివుడిని ఒకేరోజు ఎందుకు..
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు? విష్ణుమూర్తి, శివుడిని ఒకేరోజు ఎందుకు..
విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!
విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!
అమ్మమ్మ చేసే కమ్మని నెయ్యి సున్నుండలు.. ఇట్టే కరిగిపోతాయి
అమ్మమ్మ చేసే కమ్మని నెయ్యి సున్నుండలు.. ఇట్టే కరిగిపోతాయి
శాలరీలో పీఎఫ్ కట్ చేసినా మీ అకౌంట్లో వేయలేదా..? ఇలా చేస్తే చాలు..
శాలరీలో పీఎఫ్ కట్ చేసినా మీ అకౌంట్లో వేయలేదా..? ఇలా చేస్తే చాలు..
ముసుగులో ఉన్నోడు మాములోడు కాదు..
ముసుగులో ఉన్నోడు మాములోడు కాదు..
నామినేషన్‌కు గుర్రాలపై ఎంట్రీ.. గబ్బర్ సింగ్‌ను తలపిస్తూ హంగామా!
నామినేషన్‌కు గుర్రాలపై ఎంట్రీ.. గబ్బర్ సింగ్‌ను తలపిస్తూ హంగామా!