Tollywood: ఈ గ్రూప్ ఫొటోలో ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో కనిపెడితే మీరు తోపులే
తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అభిమానులు కూడా తమ హీరోల త్రో బ్యాక్ ఫొటోస్, వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

పై ఫొటోను గమనించారా? బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కాబట్టి ఇది ఇప్పటిది కాదని ఇట్టే అర్థమవుతోంది. ఇది 70వ దశకం నాటి ఫొటో. టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరో తన బ్యాచ్ తో కలిసి ఈ ఫొటో దిగాడు. అయితే ఈ ఫొటోలో అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడం కొంచెం కష్టమే. అలాగనీ కొంచెం ఓపికతో ట్రై చేస్తే కచ్చితంగా కనిపెట్టవచ్చు. స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడీ హీరో. కెరీర్ ప్రారంభంలో వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చినా హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి శోభన్ బాబు తర్వాత ఆ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న హీరో ఇతనే అని చెప్పుకోవచ్చు. అయితే సూపర్ హిట్ సినిమాలు చేసి కోట్లాది ఆస్తులు కూడ బెట్టిన ఈ నటుడు ఉన్నట్లుండి డౌన్ అయిపోయాడు. చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అయితే అధైర్యపడకుండా గోడకు కొట్టిన బంతిలా మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. విలన్ గా నూ, సపోర్టింగ్ ఆర్టిస్టుగాను మెప్పిస్తున్నారు.అలాగే బుల్లితెర యాంకర్ గానూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉంటోన్న ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు.
కాగా సినిమాలు, టీవీ షోస్ తో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను ట్విట్టర్ లో షేర్ చేసుకుంటున్నారు. తన వెకేషన్ ప్లేసెస్,, తన డైట్‌కు సంబంధించిన విషయాల్ని తరచూ ఏదో ఒకటి తన ఫాలోవర్లతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో జగ్గూ భాయ్ రేంజ్ అమాంతం పెరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తన బ్యాచ్ ఫొటోను ఒకటి షేర్ చేసిన జగ్గూ భాయ్ అందులో తాను ఎక్కడ ఉన్నానో కనుక్కోమంటూ ఛాలెంజ్ విసిరాడు. అయితే చాలా మంది ఆయనను కనిపెట్టలేకపోయారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం జగ్గూభాయ్ ను కనిపెట్టారు.

Jagapathi Babu
కాగా ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు జగపతిబాబు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో జగ్గూభాయ్ చాలా ఏజ్డ్ గెటప్ లో కనిపించనున్నారు. సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Nenu ekada unano Chepandi chuddham. pic.twitter.com/OgKBY3GDuP
— Jaggu Bhai (@IamJagguBhai) February 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




