Asia Cup Rising Stars 2026: బరిలోకి వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
Asia Cup Rising Stars 2026: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, రింకూ సింగ్‌లతో కూడిన ఇండియా-ఏ జట్టు నవంబర్ 20న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 22న పాకిస్థాన్‌తో కీలక పోరు జరగనుంది.

Asia Cup Rising Stars 2026: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహిస్తున్న పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీ నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లోని దోహాలో జరగనుంది. ఈ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో 12 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ కలిపి మొత్తం 15 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. భారత్-ఏ, పాకిస్థాన్-ఏ, శ్రీలంక-ఏ, బంగ్లాదేశ్-ఏ, అఫ్గానిస్థాన్-ఏ జట్లతో పాటు నేపాల్, యూఏఈ, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి.
వైభవ్, అభిషేక్‌లతో బలంగా ఇండియా-ఏ జట్టు
ఈ టోర్నీలో ఇండియా-ఏ జట్టుకు యువ ఆటగాడు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, కుమార్ కుశాగ్ర, సూర్యాన్ష్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభకు కూడా ఈ టోర్నీ మంచి అవకాశం కానుంది.
నవంబర్ 22న పాకిస్థాన్‌తో ఢీ
ఇండియా-ఏ జట్టు నవంబర్ 20న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నవంబర్ 22న పాకిస్థాన్-ఏ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 3:30 గంటలకే మొదలవుతుంది. గ్రూప్ దశలో భారత్‌కు చివరి మ్యాచ్ నవంబర్ 24న యూఏఈతో ఉంది. ఈ మ్యాచ్ ఉదయం 11:30 గంటలకు ప్రారంభమవుతుంది. నేపాల్, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లు వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుండగా, యూఏఈతో పోరు యూనివర్సిటీ ఆఫ్ దోహా ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మైదానంలో జరగనుంది.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 షెడ్యూల్
ఈ టోర్నీలో గ్రూప్-ఏలో బంగ్లాదేశ్-ఏ, హాంకాంగ్, శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ జట్లు ఉన్నాయి. గ్రూప్-బీలో ఇండియా-ఏ, పాకిస్థాన్-ఏ, నేపాల్, యూఏఈ జట్లు పోటీపడతాయి. ప్రతి జట్టు తన గ్రూపులోని మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. మ్యాచ్‌ల పూర్తి వివరాలు ఇవే.
| తేదీ | మ్యాచ్ | భారత కాలమానం |
|---|---|---|
| నవంబర్ 19 | బంగ్లాదేశ్-ఏ vs హాంకాంగ్ | ఉదయం 11:30 |
| నవంబర్ 19 | శ్రీలంక-ఏ vs అఫ్గానిస్థాన్-ఏ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 20 | పాకిస్థాన్-ఏ vs యూఏఈ |
ఉదయం 11:30 |
| నవంబర్ 20 | ఇండియా-ఏ vs నేపాల్ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 21 | శ్రీలంక-ఏ vs హాంకాంగ్ | ఉదయం 11:30 |
| నవంబర్ 21 | బంగ్లాదేశ్-ఏ vs అఫ్గానిస్థాన్-ఏ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 22 | యూఏఈ vs నేపాల్ | ఉదయం 11:30 |
| నవంబర్ 22 | ఇండియా-ఏ vs పాకిస్థాన్-ఏ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 23 | అఫ్గానిస్థాన్-ఏ vs హాంకాంగ్ | ఉదయం 11:30 |
| నవంబర్ 23 | శ్రీలంక-ఏ vs బంగ్లాదేశ్-ఏ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 24 | ఇండియా-ఏ vs యూఏఈ | ఉదయం 11:30 |
| నవంబర్ 24 | పాకిస్థాన్-ఏ vs నేపాల్ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 26 | తొలి సెమీఫైనల్ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 27 | రెండో సెమీఫైనల్ | మధ్యాహ్నం 3:30 |
| నవంబర్ 29 | ఫైనల్ |
మధ్యాహ్నం 3:30 |
లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడొచ్చు?
భారత్‌లో ఈ టోర్నీ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టీవీ ద్వారా వీక్షించవచ్చు. మొబైల్ లేదా వెబ్‌లో చూడాలనుకునే అభిమానులకు సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. నవంబర్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్స్ జరగనుండగా.. నవంబర్ 29న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
