AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రయాణీకులు..!

దేశంలో అత్యాధునిక రైళ్లలో ఒకటిగా పేరొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. గుజరాత్‌లోని సూరత్ నగర పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో రైలులోని ఓ కోచ్ కిటికీ అద్దం దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రయాణీకులు..!
Stone Pelting On Vande Bharat
Balaraju Goud
|

Updated on: Nov 19, 2026 | 11:45 AM

Share

దేశంలో అత్యాధునిక రైళ్లలో ఒకటిగా పేరొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ నుంచి ముంబైకి వెళ్తున్న వందే భారత్ రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. గుజరాత్‌లోని సూరత్ నగర పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో రైలులోని ఓ కోచ్ కిటికీ అద్దం దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

సూరత్‌లో రాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం!

వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం (నవంబర్ 17) మధ్యాహ్నం గాంధీనగర్ నుంచి ముంబైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. నిర్ణీత మార్గంలో ప్రయాణిస్తూ సూరత్ రైల్వే స్టేషన్‌ను దాటిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. సూరత్‌లోని సచిన్, భేస్తాన్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి విసిరిన రాయి సీ4 కోచ్ కిటికీకి తగిలింది. దీంతో ఆ కోచ్‌కు సంబంధించిన కిటికీ అద్దం దెబ్బతిన్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు.

ప్రయాణికులకు తప్పిన ప్రమాదం!

రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే రాయిని తాకిన కిటికీ అద్దం దెబ్బతిన్నప్పటికీ, లోపల ప్రయాణిస్తున్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రాణనష్టం లేదా ఇతర గాయాలు సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రైల్వే భద్రతపై మరోసారి చర్చ!

ఇటీవల రైళ్లపై రాళ్లు విసిరే ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వేగంగా ప్రయాణించే వందే భారత్ వంటి రైళ్లపై ఇలాంటి దాడులు జరగడం ప్రమాదకరమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. కిటికీ అద్దాలు దెబ్బతినడంతో పాటు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులెవరు? ఉద్దేశపూర్వకంగానే రాళ్లు విసిరారా? అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మొత్తంగా సూరత్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన రాళ్ల దాడి మరోసారి రైల్వే భద్రత అంశాన్ని తెరపైకి తెచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us