AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో గుర్తు పట్టారా? సినిమా తీశాడంటే వంద కోట్లు రావాల్సిందే

సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో ఇతను కూడా ఒకడు. మొదట ఇతరె యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు.

Tollywood: ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో గుర్తు పట్టారా? సినిమా తీశాడంటే వంద కోట్లు రావాల్సిందే
Tollywood Actor
Basha Shek
|

Updated on: Apr 19, 2026 | 10:37 AM

Share

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సినిమా హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి. అలాగే సెలబ్రిటీలు కూడా తమ పుట్టిన రోజు ఇతర ప్రత్యేక సందర్బాల్లో తమ త్రో బ్యాక్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తుంటారు. దీంతో ఇవి క్షణాల్లోనే వైరలవుతుంటాయి. అభిమానులు, నెటిజన్లు కూడా తమ హీరోలు, హీరోయిన్ల చిన్ననాటి త్రో బ్యాక్ ఫొటోలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా తాజాగా ఒక స్టార్ హీరో, అతని ఫ్రెండ్స్ కు సంబంధించిన ఒక త్రో బ్యాక్ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ గ్రూప్ లో ఒక స్టార్ హీరో ఉన్నాడు. ఇప్పుడు అతను ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఈ హీరో ఒక సాధారణ యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. షార్ట్ ఫిల్మ్స్ తీసి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మెగా ఫొన్ పట్టుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. డైరెక్టర్ గా మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా హీరోగా మారిపోయాడు. నటుడిగా మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ తర్వాత తీసిన రెండు సినిమాలు కూడా వంద కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టాయి. తద్వారా వరుసగా మూడు వంద కోట్లు సినిమాల్లో నటించిన హీరోగా అరుదైన రికార్డు అందుకున్నాడు.

ఈపాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? పై ఫొటోలో సరిగ్గా మధ్యలో చెక్ షర్ట్ తో ఉన్నది మరెవరో కాదు వంద కోట్ల హ్యాట్రిక్ హీరో ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత ఇతన నటించిన నాలుగో సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). నయన తార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. అయితేనేం 50 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

కాగా హీరోగా కంటే ముందు డైరెక్టర్ గా 2019లో కోమాలి అనే సినిమా తీశాడు ప్రదీప్ రంగనాథన్. జయం రవి హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాకు గానూ ఉత్తమ నూతన దర్శకుడిగా సైమా అవార్డు అందుకున్నాడు ప్రదీప్.

Pradeep Ranganathan

Pradeep Ranganathan

LIK సినిమాలో ప్రదీప్ రంగనాథన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us