AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం.. చీఫ్‌ గెస్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ శిల్పకళా వేదికలో డిసెంబర్ 29న జరగబోయే తానా పురస్కారాల ప్రదానోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆహాజరుకానున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆయన్ను ఈ ప్రధానోత్సవానికి ఆహ్వానించారు.

Hyderabad: హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం.. చీఫ్‌ గెస్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి
Tana Awards 2026
Anand T
|

Updated on: Nov 18, 2026 | 9:43 PM

Share

హైదరాబాద్‌లో అమెరికా తెలుగు సంఘం (తానా – TANA) ఆధ్వర్యంలో ఈ నెల డిసెంబర్ 29న తానా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలోని శిల్పకళా వేదికలో జరగనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పది మంది ప్రముఖులను ఈ సందర్భంగా తానా పురస్కారాలతో ఘనంగా సత్కరించనుంది.

పది మంది ప్రముఖులకు తానా పురస్కారాలు

ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో అమరరాజా గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, జమీలా నిషాత్, డాక్టర్ సునీతా కృష్ణన్‌లకు పురస్కారాలు అందజేయనున్నారు. అలాగే జయధీర్ తిరుమల రావు, గడ్డం సమ్మయ్య, చింతకింది మల్లేశం, చింతల వెంకట్ రెడ్డి, దాసరి కొండప్ప తదితరులను కూడా తానా పురస్కారాలతో సత్కరించనున్నారు. సుద్దాల అశోక్ తేజకు తానా అందె శ్రీ పురస్కారం అందించనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన తెలుగు ప్రముఖులను ఒకే వేదికపై సత్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి వెల్లడించారు తెలిపారు.

తానా 25వ మహాసభలకు ఏర్పాట్లు

ఇదిలా ఉండగా తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో తానా 25వ మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిర్వహించనున్న పురస్కారాల ప్రదానోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తానా ప్రతినిధులు తెలుగు ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ వేడుకలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, తెలుగు సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..
అద్భుతాల నిలయం తిరుమల శ్రీవారి ఆలయం.. ఒక్కో మండపం వెనుక ఇంతటి..
అద్భుతాల నిలయం తిరుమల శ్రీవారి ఆలయం.. ఒక్కో మండపం వెనుక ఇంతటి..
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉండే.. ఇంటి అందంతో పాటు ఆరోగ్యం
ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉండే.. ఇంటి అందంతో పాటు ఆరోగ్యం
IND vs NZ: టీమిండియాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. అదేంటంటే..?
IND vs NZ: టీమిండియాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. అదేంటంటే..?
దిండు కవర్ మాత్రమే ఉతుకుతున్నారా? మీరు చేస్తున్న పొరపాటు ఇదే
దిండు కవర్ మాత్రమే ఉతుకుతున్నారా? మీరు చేస్తున్న పొరపాటు ఇదే
ఎన్ని సార్లు ఉతికినా టీ మరకలు పోవట్లేదా? వీటితో చిటికెలో మాయం!
ఎన్ని సార్లు ఉతికినా టీ మరకలు పోవట్లేదా? వీటితో చిటికెలో మాయం!
ఈ రెండు చోట్ల పుట్టుమచ్చలు ఉన్నాయా? మీకు రాజయోగం.. కోటీశ్వరులే..
ఈ రెండు చోట్ల పుట్టుమచ్చలు ఉన్నాయా? మీకు రాజయోగం.. కోటీశ్వరులే..
దోశ వేసేముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు..?
దోశ వేసేముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు..?