AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏం కష్టం వచ్చిందో పాపం.. చూస్తుండగానే భవనంపై నుంచి దూకేసిన మహిళ!

నిర్మల్‌లో జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను హాస్పిటల్‌కు తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: ఏం కష్టం వచ్చిందో పాపం.. చూస్తుండగానే భవనంపై నుంచి దూకేసిన మహిళ!
Nirmal Woman Jumps From 5 Story Building
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 7:06 PM

Share

పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ మహిళ ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంపైకి ఎక్కిన మహిళ.. అందరూ చూస్తుండగానే పై నుంచి కిందకు దూకింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతగా అనే మహిళకు భర్త రవితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో గొడవపడిన సంగీత.. అక్కడి నుంచి నిర్మల్ పట్టణానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం శివాజీ చౌక్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆత్మహత్యాయత్నం చేయవద్దంటూ ఫోన్ ద్వారా ఆమెకు నచ్చజెప్పేందుకు ట్రై చేశారు. సుమారు గంట పాటు పోలీసులు, స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎవరైనా దగ్గరకు వస్తే దూకేస్తానని భయపెట్టింది.. చివరకు అన్నంత పని చేసింది. ఆమెను కాపాడేందుకు కొందరు యువకులు బిల్డింగ్ పైకి చేరుకోగా.. అందరూ చూస్తుండగానే భవనంపై నుంచి కిందకు దూకింది.

ఆమె కింద పడగానే వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు అంబులెన్స్‌ సహాయంతో ఆమెను నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో శివాజీ చౌక్ పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది.

అయితే సంగీతను కాపాడేందుకు పోలీసులు, అగ్ని మాపక శాఖ రంగంలోకి దిగినా.. కింద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కాళ్లకు, నడుముకు తీవ్రగాయాలయ్యాయి. రెండు కాళ్లు విరిగిపోయినట్టు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కు తరలించారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంగీత ఆత్మహత్యాయత్నానికి‌ గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us