AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akwan Alert: తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌

రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కేంద్రకృతమైన అక్వాన్ తీవ్ర తుఫాన్ శుక్రవారం మధ్యాహ్ననికి నరసాపురం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో గురువారంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

Akwan Alert: తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌
Cyclone Akwan Alert
Anand T
|

Updated on: Nov 18, 2026 | 9:55 PM

Share

దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 09 కిమీ వేగంతో కదులుతుందని తెలిపారు. ఇది ప్రస్తుతానికి నరసాపురానికి 500 కిమీ, కళింగపట్నంకి 540కిమీ, చెన్నైకి 560 కిమీ, గోపాల్‌పూర్‌కి 630 కిమీ, పూరీకు 690 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.

శుక్రవారం మధ్యాహ్ననికి నరసాపురం- పూరీ మధ్య ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో గురువారం ఈ క్రింది జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.

గురువారం (19-11-2026) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ఉత్తరాంధ్ర తీరం వెంబడి రేపు గంటకు 60-70 కి.మీ గరిష్టంగా 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే శ్రీకాకుళం, టెక్కలి, పలాస 3 ఎన్డీఆర్ఎఫ్, విజయనగరంలో 1 ఎస్డీఆర్ఎఫ్, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరు, సీతంపేటలో 2ఎన్డీఆర్ఎఫ్ మొత్తంగా 5 NDRF, 1 SDRF, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్య
భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్య
సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ..
సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ..
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..
అద్భుతాల నిలయం తిరుమల శ్రీవారి ఆలయం.. ఒక్కో మండపం వెనుక ఇంతటి..
అద్భుతాల నిలయం తిరుమల శ్రీవారి ఆలయం.. ఒక్కో మండపం వెనుక ఇంతటి..
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉండే.. ఇంటి అందంతో పాటు ఆరోగ్యం
ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉండే.. ఇంటి అందంతో పాటు ఆరోగ్యం
IND vs NZ: టీమిండియాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. అదేంటంటే..?
IND vs NZ: టీమిండియాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. అదేంటంటే..?
దిండు కవర్ మాత్రమే ఉతుకుతున్నారా? మీరు చేస్తున్న పొరపాటు ఇదే
దిండు కవర్ మాత్రమే ఉతుకుతున్నారా? మీరు చేస్తున్న పొరపాటు ఇదే