AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో సెంచరీ.. ఐపీఎల్ వేలానికి ముందే 17 ఏళ్ల ప్లేయర్ బీభత్సం..!

Vikalp Tiwari Century: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2026లో పదిహేడేళ్ల కుర్రాడు సంచలనం సృష్టించాడు. ఛత్తీస్‌గఢ్ కెప్టెన్ వికల్ప్ తివారీ 44 బంతుల్లో శతకంతో ఒడిశాపై విధ్వంసం సృష్టించాడు. 56 బంతుల్లో 119 పరుగులతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో సెంచరీ.. ఐపీఎల్ వేలానికి ముందే 17 ఏళ్ల ప్లేయర్ బీభత్సం..!
Vikalp Tiwari Century
Venkata Chari
|

Updated on: Nov 18, 2026 | 10:05 PM

Share

Vikalp Tiwari Century: దేశవాళీ క్రికెట్ అంటేనే భవిష్యత్ స్టార్లకు పురిటిగడ్డ. బీసీసీఐ నిర్వహించే సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) మరోసారి ఆ మాటను నిజం చేసింది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో స్టార్ ఆటగాళ్లకే కాదు, కుర్రాళ్లకు కూడా తమ ప్రతిభను చాటే వేదిక దొరుకుతుంది. నవంబర్ 14న ప్రారంభమైన SMAT 2026 మూడో రౌండ్‌లో అలాంటి అద్భుతమే ఆవిష్కృతమైంది. కోల్‌కతా వేదికగా ఛత్తీస్‌గఢ్-ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల కెప్టెన్ వికల్ప్ తివారీ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. కెరీర్‌లో మూడో T20 మాత్రమే ఆడుతున్న కుర్రాడు ఇంత పరిణతితో, ఇంత విధ్వంసంతో ఆడటం అరుదు.

19 బంతుల్లో హాఫ్ సెంచరీ, 44 బంతుల్లో సెంచరీ..!

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌గఢ్‌కు వికల్ప్ ఆది నుంచే దూకుడు మొదలుపెట్టాడు. ఒడిశా బౌలర్ల లైన్-లెంగ్త్‌ను పసిగట్టి మొదటి ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అక్కడితో ఆగలేదు. అదే జోరును కొనసాగించి 44 బంతుల్లోనే తన T20 కెరీర్ తొలి శతకాన్ని నమోదు చేశాడు.

ఎక్కువమంది చదివినది: Video: 13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం.. 281 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ దోస్త్ రికార్డుల మోత..!

ఇవి కూడా చదవండి

చివరకు 56 బంతుల్లో 212.50 స్ట్రైక్ రేట్‌తో 119 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఔట్ కాలేదు, గాయం వల్లనే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ ఇన్నింగ్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IPL ఫ్రాంచైజీల కన్ను వికల్ప్‌పైనే..!

ఈ శతకం టైమింగ్ చాలా కీలకం. నెల రోజుల్లో ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. ఇలాంటి సమయంలో 17 ఏళ్ల కుర్రాడు 44 బంతుల్లో శతకం బాదితే ఫ్రాంచైజీలు ఊరుకోవు. ఛత్తీస్‌గఢ్ కెప్టెన్ ఖచ్చితంగా స్కౌట్ల దృష్టిలో పడిపోయాడు. రాబోయే మ్యాచుల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే ఏదో ఒక జట్టు అతనిపై పందెం వేయడం ఖాయం.

మ్యాచ్ ఫలితం: ఛత్తీస్‌గఢ్‌కు రెండో విజయం..

వికల్ప్‌తో పాటు అజయ్ మండల్ 28 బంతుల్లో 50 పరుగులతో మెరిశాడు. దీంతో ఛత్తీస్‌గఢ్ 20 ఓవర్లలో 228/4 భారీ స్కోరు చేసింది. 229 లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా 20 ఓవర్లలో 177/8కే పరిమితమైంది. దీంతో 51 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్ ఘన విజయం సాధించింది.

ఎక్కువమంది చదివినది: IPL 2027 Retention: రిటెన్షన్ తర్వాత మారిన లెక్కలు.. పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?

ఇది SMAT 2026లో మూడు మ్యాచుల్లో ఛత్తీస్‌గఢ్‌కు రెండో విజయం. గ్రూప్-డీలో 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్ నవంబర్ 20న గుజరాత్‌తో. వికల్ప్ మరోసారి చెలరేగుతాడా? యావత్ దేశం ఎదురుచూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..
నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..
ఆ నటుడితో వర్క్ చేయడం ఒక పీడకల.. మాట్లాడే పద్ధతి కూడా తెలియదు
ఆ నటుడితో వర్క్ చేయడం ఒక పీడకల.. మాట్లాడే పద్ధతి కూడా తెలియదు
ఒక్క గ్లాస్ పోస్తే.. ఎండిపోతున్న తులసమ్మ గుబురుగా, పచ్చగా
ఒక్క గ్లాస్ పోస్తే.. ఎండిపోతున్న తులసమ్మ గుబురుగా, పచ్చగా
తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్య
భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్య
సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ..
సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ..
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..
అద్భుతాల నిలయం తిరుమల శ్రీవారి ఆలయం.. ఒక్కో మండపం వెనుక ఇంతటి..
అద్భుతాల నిలయం తిరుమల శ్రీవారి ఆలయం.. ఒక్కో మండపం వెనుక ఇంతటి..