AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Raj: ఆ జబ్బు కారణంగా భార్య, పిల్లలకు దూరమై.. పాపం ఈ టాలీవుడ్ విలన్ చనిపోయే ముందు ఇంత క్షోభ అనుభవించారా?

1988లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ నటుడు 2022 వరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో 300లకు పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పవర్ ఫుల్ విలన్ పాత్రలతో ఆడియెన్స్ ను బాగా భయపెట్టారీ నటుడు.

Mohan Raj: ఆ జబ్బు కారణంగా భార్య, పిల్లలకు దూరమై.. పాపం ఈ టాలీవుడ్ విలన్ చనిపోయే ముందు ఇంత క్షోభ అనుభవించారా?
Tollywood Actor Mohan Raj
Basha Shek
|

Updated on: Nov 18, 2026 | 8:12 PM

Share

మోహన్ రాజ్.. ఈ తరం ఆడియెన్స్ కు ఈ నటుడి గురించి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1980-90 సినిమా ప్రేక్షకులకు ఈ పవర్ ఫుల్ విలన్ బాగా పరిచయమే. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో సుమారు 300 కు పైగా సినిమాల్లో నటించారు మోహన్ రాజ్. ఎక్కువగా విలన్ పాత్రలోనే పోషించిన ఆయన రెండు జపనీస్ చిత్రాల్లో కూడా ప్రతినాయకుడి పాత్రలు పోషించడం విశేషం. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా చేశారు మోహన్ రాజ్. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి ఎందరో స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. లారీ డ్రైవర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్‌స్పెక్టర్, చినరాయుడు, మెకానిక్ అల్లుడు, నిప్పు రవ్వ, బొబ్బిలి సింహం, పోకిరి రాజా, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సీతయ్య, శివమణి.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారీ నటుడు. మోహన్ రాజ్ అసలు పేరు మోహనరాజన్. సినిమాల్లోకి రాక ముందు ఆయన వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో విధులు నిర్వర్తించారు. కేరళ పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్, కస్టమ్స్ ఆఫీసర్ ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించారు. ముఖ్యంగా ఈడీ అధికారిగా పనిచేస్తున్న సమయంలో మోహన్ రాజ్ ఎంతో నిజాయితీగా, ముక్కుసూటిగా ఉండేవారట. ముఖ్యంగా అవినీతికి అసలు తలొగ్గేవారు కాదట. ఈ కారణంతోనే 1989లో అనుమతి లేకుండా సినిమాల్లో నటించారని మోహన్ రాజ్ పై సస్పెన్షన్ వేటు వేశారట.

కాగా అప్పటికే కోట్ల ఆదాయం, నటుడిగా స్టార్ డమ్ ఉన్న మోహన్ రాజ్ తన ఆత్మగౌరవం కోసం, తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం తన సస్పెన్షన్ పై సుమారు 20 ఏళ్లు న్యాయ పోరాటం చేశారు. చివరికి 2010లో కోర్టు తీర్పుతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల పాటు సర్వీసు పూర్తి చేసిన మోహన్ రాజ్ 2015లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

ఇదిలా ఉంటే వెండితెరపై కరడుగట్టిన విలన్ గా కనిపించే మోహన్ రాజ్ నిజ జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంటారట. చీమకు కూడా హాని తలపెట్టని మృదుస్వభావి అని ఆయన గురించి తెలిసిన వారందరూ అంటారు. ఇక మోహన్ రాజ్ భార్య పేరు ఉష. ఆమె చెన్నై హడ్కోలో పనిచేశారు. వీరికి జైష్మా, కావ్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా 60 ఏళ్ల వయసు వరకు ఎంతో ఫిట్‌గా ఉన్న మోహన్ రాజ్ 2015 తర్వాత కాళ్లలో వేరికోస్ వెయిన్స్ సమస్యతో పాటు పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడ్డారు. దీంతో తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. అయితే ఈ బాధ కంటే భార్య తనను, తన పిల్లలను వదిలేసి వెళ్లిపోవడం మోహన్ రాజ్ ను తీవ్రంగా బాధించిందట. ఈ కారణంగానే తీవ్ర మనోవదేనకు గురైన ఆయన 2024 అక్టోబర్ లో కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ టాలీవుడ్ విలన్ చనిపోయే ముందు ఇంత క్షోభ అనుభవించారా?
ఈ టాలీవుడ్ విలన్ చనిపోయే ముందు ఇంత క్షోభ అనుభవించారా?
చేతులు లేకపోతేనేం.. గుండెధైర్యం ఉందిగా.. విధినే ఎదురించి పిల్లల..
చేతులు లేకపోతేనేం.. గుండెధైర్యం ఉందిగా.. విధినే ఎదురించి పిల్లల..
నవ్వుతోనే ఈ రోగానికి చెక్ పెట్టొచ్చు! లాఫ్టర్ థెరపీతో ఇన్ని లాభాల
నవ్వుతోనే ఈ రోగానికి చెక్ పెట్టొచ్చు! లాఫ్టర్ థెరపీతో ఇన్ని లాభాల
పళ్ల మధ్య ఖాళీ ఉందా?.. మీరు తోపులెహె..
పళ్ల మధ్య ఖాళీ ఉందా?.. మీరు తోపులెహె..
జున్నులా ఉండే క్రీమ్ క్యారమెల్ పుడ్డింగ్.. చేసుకోండి సులభంగా
జున్నులా ఉండే క్రీమ్ క్యారమెల్ పుడ్డింగ్.. చేసుకోండి సులభంగా
నల్లగా మారిన వెండి పట్టీలు, మెట్టెలను ఇలా శుభ్రం చేయండి..
నల్లగా మారిన వెండి పట్టీలు, మెట్టెలను ఇలా శుభ్రం చేయండి..
తండ్రి లక్కీ నంబర్‌తో టికెట్.. 200 గ్రాముల బంగారం గెలుపు!
తండ్రి లక్కీ నంబర్‌తో టికెట్.. 200 గ్రాముల బంగారం గెలుపు!
అన్నం, చపాతీ, బిర్యానీలోకి అదిరిపోయే ఘుమఘుమలాడే మటన్ గ్రేవీ కర్రీ
అన్నం, చపాతీ, బిర్యానీలోకి అదిరిపోయే ఘుమఘుమలాడే మటన్ గ్రేవీ కర్రీ
IND vs NZ 1st Test: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఆ ఇద్దరు బెంచ్‌కే..
IND vs NZ 1st Test: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఆ ఇద్దరు బెంచ్‌కే..
రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేష్ బిగ్‌ అప్‌డేట్
రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేష్ బిగ్‌ అప్‌డేట్