AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dulquer Salmaan: స్కూల్ లో పరిచయం.. ఫేస్‌బుక్‌లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు ఇప్పుడు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ హ్యాండ్సమ్ హీరోకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. మరి ఇంత క్రేజ్, పాపులారిటీ ఉన్న దుల్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమల్ గురించి మీకు తెలుసా?

Dulquer Salmaan: స్కూల్ లో పరిచయం.. ఫేస్‌బుక్‌లో ప్రేమ.. దుల్కర్ లవ్ స్టోరీ సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు
Dulquer Salmaan Family
Basha Shek
|

Updated on: Nov 18, 2026 | 7:19 PM

Share

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటవారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు దుల్కర్ సల్మాన్. అనతి కాలంలోనే తన సొంత టాలెంట్ తో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఓ వైపు యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు లవ్, ఫీల్ గుడ్ సినిమాలు చూస్తూ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ముఖ్యంగా ఈ హీరోకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఇదిలా ఉంటే ఈ మలయాళం హీరో ఈ మధ్యన ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే కనిపిస్తున్నాడు. మహానటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. సీతా రామం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత లక్కీ భాస్కర్ మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పుడు ఆకాశంలో ఒక తార అంటూ మరో ఫీల్ గుడ్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. పవన్ సాధినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించింది. కాగా ఆకాశంలో ఒక తార ప్రమోషన్లలో భాగంగా ఒక టాక్ షోకు హాజరయ్యాడు దుల్కర్. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ క్రేజీ హీరో. ఇదే క్రమంలో తన భార్య అమల్ గురించి తనతో లవ్ స్టోరీ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.

దుల్కర్ సల్మాన్ ఆర్చిటెక్ట్ అమల్ సుఫీయాన ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2011లో వీరి వివాహం జరిగింది. 2017లో ఈ దంపతులకు అమీరా సల్మాన్ పండంటి ఆడ బిడ్డ పుట్టింది. తన భార్య గురించి మాట్లాడిన దుల్కర్ సల్మాన్.. ‘అమల్ నా స్కూల్లో జూనియర్. నా కంటే కూడా ఒక ఐదు సంవత్సరాలు చిన్నదే. నేను 12 క్లాసు చదువుతున్న సమయంలో అమల్ ఆరో తరగతి చదువుతుండేది. స్కూళ్లోనే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పుడు ప్రేమ అలాంటిది లేదు. అయితే చాలా సంవత్సరాల తర్వాత చెన్నైలో ఉంటున్నప్పుడు మేమిద్దరం అనుకోకుండా ఎదురుపడ్డాం. ఇలా పలు సందర్భాలలో ఒకరికొకరు ఎదురు పడటంతో ఫేస్ బుక్ ద్వారా స్నేహితులుగా మారాం. అలా మా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా చిగురించింది. మేమిద్దరం ఫస్ట్ డేట్ వెళ్లినప్పుడు ఇద్దరికీ సంబంధించిన విషయాలు గురించి చాలా మాట్లాడుకున్నాం. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నాం. ఆ సమయంలోనే అమల్ పై ప్రేమ కలిగింది. ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి మంచి అవగాహన ఉండడంతో మా ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాం. వారు కూడా మా ప్రేమను ఆశీర్వదించారు. అలా మా వివాహం 2011 డిసెంబర్ 22వ తేదీ చెన్నైలో జరిగింది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ మలయాళం స్టార్ నటుడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

భార్యతో దుల్కర్ సల్మాన్..

View this post on Instagram

A post shared by Bhuvanesh S (@bujji5749)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us