AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biker OTT: అప్పుడే ఓటీటీలోకి ‘బైకర్’!శర్వానంద్ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ బైకర్. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ మరో కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Biker OTT: అప్పుడే ఓటీటీలోకి 'బైకర్'!శర్వానంద్ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Biker Movie
Basha Shek
|

Updated on: Apr 19, 2026 | 7:49 PM

Share

ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి నారి నారి నడుమ మురారి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. దీని తర్వాత బైకర్ అంటూ ఓ స్పోర్ట్స్ డ్రామాతో మన ముందుకు వచ్చాడు శర్వా. అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ హీరో తండ్రిగా ఓ కీలక పాత్రలో కనిపించారు. మాళవిక నాయర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా యూవీ క్రియేషన్స్ బైకర్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బైకర్ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా హిట్ టాక్ తో మంచి వసూళ్లనే రాబట్టింది. శర్వానంద్, రాజశేఖర్ ల నటన, తండ్రీ కొడుకుల ఎమోషనల్ సెంటిమెంట్, రేసింగ్ సన్నివేశాలు బైకర్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. సామాన్యులే కాదు అక్కినేని నాగార్జున, పీవీ సింధు లాంటి ప్రముఖులు కూడా బైకర్ సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. కాగా ఇప్పటికీ థియేటర్లలో ఓ మోస్తరు వసూళ్లను రాబడుతోన్న బైకర్ సినిమా డిజిట్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని సమాచారం.

బైకర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా మే 1, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రస్తుతం కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బైకర్ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. జిబ్రాన్ ఈ మూవీకి స్వరాలు అందించారు. మరి థియేటర్స్ లో మంచి స్పందన తెచ్చుకున్న బైకర్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ చేతిలో బైకర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2 కిలోమీటర్ల దూరానికి.. 30 నిమిషాలా?.. ఈ రూట్‌లో నరకం
2 కిలోమీటర్ల దూరానికి.. 30 నిమిషాలా?.. ఈ రూట్‌లో నరకం
ఇండస్ట్రీని ఏలిన అందమైన హీరోయిన్..
ఇండస్ట్రీని ఏలిన అందమైన హీరోయిన్..
భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం
భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం
మినప, పెసల కంటే 100 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా చాలు ఉల్లాసంగా
మినప, పెసల కంటే 100 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా చాలు ఉల్లాసంగా
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కీలక భేటీ..
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?
వేలం కంటే ముందే హార్దిక్‌కు గుడ్ బై చెప్పనున్న ముంబై.. ఎందుకంటే?