AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thiruveer: హీరో తిరువీర్ కుమారుడి నామకరణ మహోత్సవం.. ఏం పేరు పెట్టారో తెలుసా?

చేస్తుంది చిన్న సినిమాలే అయినా బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తిరువీర్. ఇటీవలే పాపం ప్రతాప్ అనే మరో డిఫరెంట్ సినిమాతో మన ముందుకు వచ్చాడీ హీరో. ఏప్రిల్ 17న రిలీజైన ఈ మూవీ డీసెంట్ టాక్ తో రన్ అవుతోంది.

Thiruveer: హీరో తిరువీర్ కుమారుడి  నామకరణ మహోత్సవం.. ఏం పేరు పెట్టారో తెలుసా?
Actor Thiruveer Family
Basha Shek
|

Updated on: Apr 21, 2026 | 4:45 PM

Share

టాలీవుడ్ యంగ్‌ హీరో తీరువీర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రేడీయో జాకీగా కెరీర్ ప్రారంభించిన అతను 2016లో బొమ్మల రామారం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో సహాయక నటుడిగా, విలన్ గా ఆకట్టుకున్నాడు. ఘాజీ, ఏ మంత్రం వేశావే, మల్లేషం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్ సినిమాల్లో మెరిశాడు. ఇక మసూద సినిమాతో హీరోగానూ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పరేషాన్, మోక్షపటం, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా పాపం ప్రతాప్ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. సినిమాల సంగతి పక్కన పెడితే తిరువీర్ గతేడాది డిసెంబర్‌లో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య కల్పానారావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ కుమారుడికి నామకరణ మహోత్సవం నిర్వహించారు తిరువీర్ దంపతులు. ఇవాళే వీరి రెండో పెళ్లి రోజు కావడంతో కొడుకు పేరును రివీల్ చేశారు. తమ ముద్దుల కుమారుడికి అథర్వ్‌ రెడ్డి అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తిరువీర్- కల్పనా రావు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా తిరువీర్- కల్పనల వివాహం 2024లో జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా వీరు ఏడడుగులు నడిచారు. ఇక పాపం ప్రతాప్ సినిమా విషయానికి వస్తే.. ఎస్‌.పీ. దుర్గ నరేష్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో తిరువీర్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించింది. అలాగే రాశి, అజయ్ ఘోష్, శ్రీనివాస అవసరాలు, రూప లక్ష్మి, దేవీ ప్రసాద్, గోపరాజు రమణ, రఘుబాబు, ప్రసాద్ బెహరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్, కృషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మదిరె సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం అందించగా, సురేష్ బొబ్బిలి బీజీఎం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

భార్య, కుమారుడితో హీరో తిరువీర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us