AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా వల్ల అవకాశాలు చాలా తగ్గాయి.. అలాంటి పాత్రలే చేస్తా అనుకున్నారు: సత్య కృష్ణ

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి సత్య కృష్ణ.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తల్లి, వదిన, అక్క పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించి మెప్పించారు. ఇటీవల కాలంలో ఆమె సినిమాలు కాస్త తగ్గించారు.

Rajeev Rayala
|

Updated on: Mar 22, 2026 | 7:50 AM

Share
సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి సత్య కృష్ణ.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తల్లి, వదిన, అక్క పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించి మెప్పించారు. ఇటీవల కాలంలో ఆమె సినిమాలు కాస్త తగ్గించారు. సత్య కృష్ణ కూతురు కూడా ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది. 

1 / 6
గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మెంటల్ కృష్ణ చిత్ర అనుభవాలనుపంచుకున్నారు. ఆ సినిమాలో ఆమె మెయిన్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.. సత్యకృష్ణ మాట్లాడుతూ.. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సంప్రదించినప్పటికీ, తర్వాత లీడ్ రోల్ చేయమని అడిగారని చెప్పారు. ఆ సినిమా చేయడం వల్ల. ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన తర్వాత, తాను కేవలం ప్రధాన పాత్రలకే పరిమితం అవుతుందని చాలామంది నిర్మాతలు, దర్శకులు భావించారని, దానివల్ల క్యారెక్టర్ రోల్స్ తగ్గిపోయాయని ఆమె గుర్తు చేసుకున్నారు.

2 / 6
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత, తిరిగి నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించానని, కొన్ని ప్రాముఖ్యత కలిగిన పాత్రలు కూడా తనకు లభించాయని తెలిపారు. సినిమా విజయం ఆర్టిస్టుల చేతుల్లో ఉండదని, కేవలం తమ వంతు కృషి మాత్రమే చేయగలమని ఆమె అన్నారు. సత్య కృష్ణన్‌ను నటిగా పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనిపించుకుంటే చాలని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

3 / 6
డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉందని, ఈ మధ్య కొన్ని విభిన్నమైన పాత్రలు చేశానని, అవి ఇంకా విడుదల కావాల్సి ఉందని సత్య కృష్ణన్ వెల్లడించారు. ఒక ఓటీటీ ప్రాజెక్టులో చాలా మంచి, తాను ఇంతకుముందు చేయని విభిన్నమైన పాత్ర చేశానని చెప్పారు. తన రూపాన్ని బట్టి అప్పర్ మిడిల్ క్లాస్, సంసారపక్షమైన పాత్రలకే పరిమితం అవుతున్నానని, రగ్గడ్ లుక్ ఉన్న పాత్రలు రావట్లేదని ఆమె అన్నారు.

4 / 6
అయితే నాని నటించిన దసరా వంటి సినిమాల్లోని రగ్గడ్ లోకేషన్స్‌లో, మాస్ స్లాంగ్‌తో కూడిన పాత్రలు చేయాలనే ఆసక్తి తనకు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక మాండలికం మాట్లాడగలనని, తెలంగాణ యాసను కూడా కొంతవరకు మేనేజ్ చేయగలనని, అయితే శ్రీకాకుళం వంటి యాసలు కష్టమని చెప్పారు. 

5 / 6
మాస్ క్యారెక్టర్లు చేయడానికి పూర్తిగా ఇష్టమేనని, అలాంటి పాత్రలు తనకు రావట్లేదని తెలిపారు. గతంలో ఒక చిన్న సినిమాలో తాగుబోతు మొగుడి భార్యగా, చేపల వేట కుటుంబానికి చెందిన పాత్ర చేశానని, అది చాలా చిన్న బడ్జెట్ చిత్రం అయినప్పటికీ, ఎటువంటి గ్లామర్ లేని పాత్రను ఎంతో ఆస్వాదించానని ఆమె గుర్తు చేసుకున్నారు. 

6 / 6
Follow Us