తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల సంఘం అధికారులు ఓటర్లను ఆకర్షించేందుకు, పోలింగ్ శాతం పెంచేందుకు వినూత్న ప్రయోగం చేశారు. లేడీ రోబోతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. 100% పోలింగ్ నమోదు చేయడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం జరుగుతోంది. ఓటర్లు ఈ లేడీ రోబోను ఆశ్చర్యంగా చూస్తున్నారు.