AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP DSC 2026 Notification: నిరుద్యోగులకు అలర్ట్‌.. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలపై కీలక అప్‌డేట్! పోస్టులు ఎన్ని ఉన్నాయంటే..

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. మొత్తం నాలుగు విడతల్లో అన్ని పోస్టుల భర్తీకి 41 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇందులో డీఎస్సీ, పోలీసు నియామకాలు మినహా మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ఇందులో ముందుగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 1500 ప్రెఫెసర్ పోస్టులు..

AP DSC 2026 Notification: నిరుద్యోగులకు అలర్ట్‌.. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలపై కీలక అప్‌డేట్! పోస్టులు ఎన్ని ఉన్నాయంటే..
AP DSC notification Release date
Srilakshmi C
|

Updated on: Mar 22, 2026 | 7:58 AM

Share

అమరావతి, మార్చి 22: ఉగాది రోజున కూటమి సర్కార్ 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో దీనిని విడుదల చేశారు. ఈ క్యాలెండర్‌లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ తేదీలను కూడా ముందే ప్రకటించారు. మొత్తం నాలుగు విడతల్లో అన్ని పోస్టుల భర్తీకి 41 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇందులో డీఎస్సీ, పోలీసు నియామకాలు మినహా మిగతా అన్ని పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ఇందులో ముందుగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 1500 అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు మే 15న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ పోస్టులకు 2018లో నిర్వహించినట్లే ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తారు.

ఏపీ నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డీఎస్సీలో 2,535 పోస్టులకు నోటిఫికేషన్‌

అత్యధికంగా పాఠశాల విద్యలో 3,004 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. తర్వాత హోంశాఖలో అధికంగా 2,778 పోస్టులు ఉన్నాయి. ఇక పాఠశాల విద్యాశాఖ మొత్తం 2,535 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అక్టోబరు 15న నోటిఫికేషన్‌ జారీ చేయాలని భావిస్తుంది. అలాగే డైట్‌, ఎన్సీఈఆర్టీ లెక్చరర్‌ పోస్టులు 160, జూనియర్ లెక్చరర్‌ పోస్టులు 209, లైబ్రేరియన్‌ పోస్టులు 100 వరకు ఇదే నెలలో నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌లో ప్రకటన విడుదల తేదీని ఇచ్చారు. ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో స్పెషల్ డీఎస్సీ, ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్యాన్స్‌ టీచర్‌ ఖాళీలనూ భర్తీచేస్తారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా డీఎస్సీ ఇస్తామని ఇప్పటికే మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ఖాళీలు, పదవీవిరమణతో వచ్చేవాటిని కలిపి నాలుగేళ్లకు విభజించి పోస్టులను ప్రకటించారు. మొత్తం 10,060 ఉద్యోగాలను ఈ మేరకు ఉగాది కానుకగా మంత్రి లోకేష్‌ జాబ్‌ క్యాలెండర్‌ జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

ఏపీ నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు తమ విద్యార్హతలకు సరిపోయే ఉద్యోగ ప్రకటనలు వచ్చేలోపు నైపుణ్య పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సి ఉంటుంది. ఈ పోర్టల్‌ ద్వారా వివరాలు నమోదుచేస్తే జాబ్‌ క్యాలెండర్‌లోని ఉద్యోగాల ప్రకటనలతో పాటు భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్ల సమాచారం సైతం అభ్యర్థులకు అందుతుంది. ముందుగా ఆధార్‌ నంబరు నమోదు చేసి, సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ఈ పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

ఏపీ నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర