AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwana OTT: ఆహా ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. ‘దీవానా’ స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన

ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం 'దీవానా'. యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై ఇందులో హీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఇప్పుడు ఆహా ఓటీటీలోకి రానుంది.

Diwana OTT: ఆహా ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. 'దీవానా' స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన
Deewana Movie In Aha OTT
Basha Shek
|

Updated on: Jul 28, 2026 | 7:19 PM

Share

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘దీవానా’. శ్రీకాంత్ సంఘిశెట్టి తెరకెక్కించిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీలో స్మేహా మణిమేఘలై హీరోయిన్ గా చేసింది. హైదరాబాద్ కుర్రోడి ప్రేమకథ అంటూ రిలీజ్ కు ముందే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. అలాగే టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 19న థియేటర్లలో రిలీజైన దీవానా సినిమాకు సూపర్ హిట్ టాక్ రాకపోయినా డీసెంట్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచిగానే వసూళ్లు రాబట్టింది. అప్పటికీ పోటీగా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా థియేటర్లలో ఉన్నప్పటికీ దీవానా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే బిగ్ స్క్రీన్ పై ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించిన దీవానా సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే దీవానా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.

దీవానా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జులై 31 నుంచి ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఓటీటీలోకి రానుంది. అయితే ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రం 24 గంటల ముందే ఈ సినిమాను చూసే అవకాశం లభించనుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ‘మిస్ అయితే మస్త్ ఫీల్ అవుతావ్’ అంటూ దీవానా సినిమా పోస్టర్ ను షేర్ చేసింది ఆహా.

ఇవి కూడా చదవండి

ఆహా ఓటీటీలో దీవానా సినిమా..

దీవానా సినిమా విషయానికి వస్తే.. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా ఆహా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

దీవానా సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us