AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Jagannadh: ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు.. నెలకు 50 లక్షల వడ్డీ కట్టాడు: రఘు కుంచె

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వ్యక్తిగత జీవితం గురించి ఆయన క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ సింగర్ రఘు కుంచె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూరి ఒక వ్యక్తిని బాగా నమ్మాడని, కానీ చివరకు అతని వల్లే అప్పుల్లో కూరుకుపోయాడని రఘు చెప్పుకొచ్చారు.

Puri Jagannadh: ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు.. నెలకు 50 లక్షల వడ్డీ కట్టాడు: రఘు కుంచె
Raghu Kunche, Puri Jagannadh
Basha Shek
|

Updated on: Jul 27, 2026 | 6:06 PM

Share

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పలు హిట్ సినిమాలు అందించారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే గత కొన్నేళ్లుగా ఆయన వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా భారీ అంచనాలతో రిలీజైన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ డైరెక్టర్ కమ్ బ్యాక్ కోసం పూరితో పాటు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె పూరి జగన్నాథ్ కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులు. పూరి తెరకెక్కించిన పలు సినిమాలకు రఘు కుంచె సంగీతం అందించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన రఘు కుంచె పూరి జగన్నాథ్ వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.’ పూరి జగన్నాథ్, నేను చాలా మంచి స్నేహితులం. ఆయనతో ఏ విషయమైనా ఓపెన్‌గా మాట్లాడే చనువు నాకు ఉంది. పూరి ఒక వ్యక్తిని బాగా నమ్మాడు. కానీ ఆ వ్యక్తి ఆయనను భారీ స్థాయిలో మోసం చేశాడు. దీంతో పూరి జగన్నాథ్‌కు పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు భారీగా అప్పులు కూడా చేశాడు పూరీ.’

‘ఏక్ నిరంజన్’, ‘బంపర్ ఆఫర్’ సినిమాల సమయంలో ఆ అప్పులపై నెలకు రూ.50 లక్షల వరకు వడ్డీ చెల్లించాడు పూరి జగన్నాథ్. అదే సమయంలో ఎంతో ఇష్టంగా, భారీగా ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఆఫీస్‌ను నిర్మించుకున్నాడు. అయితే అప్పులు తీర్చలేక చివరికి ఆ ఆఫీస్‌ను కూడా అమ్మేయాల్సి వచ్చింది. గత్యంతం లేక అద్దె ఆఫీస్‌లో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాగా నమ్మిన వ్యక్తి చేసిన మోసం చేయడం వల్ల పూరి జగన్నాథ్ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి’ అని రఘు కుంచె చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం రఘు రివీల్ చేయలేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. సేతుపతితో పాటు టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
గురువు కటాక్షం.. అక్టోబర్ కల్లా వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..
IRCTC అయోధ్య టూర్ ప్యాకేజీ: వందే భారత్‌లో రామ్ లల్లా దర్శనం..
కట్టిన ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
కట్టిన ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
జూలై 31 నుంచి ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌.. పూర్తి షెడ్యూల్‌
జూలై 31 నుంచి ICET 2026 తొలి విడత కౌన్సెలింగ్‌.. పూర్తి షెడ్యూల్‌
బాలయ్య 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే
బాలయ్య 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే