Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన 9 అడుగుల భారీ జెర్రిపోతు తిరుమల శిలాతోరణం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన పక్షుల గూటిలోకి ప్రవేశించి కలకలం రేపింది. భక్తులు, సిబ్బంది భయాందోళనకు గురికాగా, సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకుని శేషాచలం అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో అక్కడి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
జీవవైవిధ్యానికి నిలయమైన శేషాచలం కొండల్లోని జీవరాశులు ఈ మధ్య కాలంలో తరచూ బయటకు వస్తూ తిరుమల భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి విషసర్పాలు, కొండచిలువలు, జెర్రిపోతులు చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ నడక మార్గాలు, జనావాసాల మధ్యలోకి వస్తున్నాయి. తాజాగా తిరుమల శిలాతోరణం వద్ద టీటీడీ అటవీశాఖ పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూటిలోకి ఏకంగా 9 అడుగుల బారీ జెర్రిపోతు ప్రవేశించింది. పక్షుల గూటిలో అంత పెద్ద పామును చూసిన భక్తులు, టీటీడీ సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫారెస్ట్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న భాస్కర్ నాయుడు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, ఆ 9 అడుగుల జెర్రిపోతును సురక్షితంగా బంధించారు. అనంతరం దాన్ని శేషాచలం దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. పామును సురక్షితంగా పట్టుకోవడంతో అక్కడ ఉన్న భక్తులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..

