వాష్రూమ్లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మహానంది దేవస్థానం కాలనీలోని ఓ ఇంటి బాత్రూమ్లో నల్లత్రాచు కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈశ్వర్ అనే వ్యక్తి సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ మోహన్ అక్కడికి చేరుకున్నారు. సుమారు గంటపాటు శ్రమించి బాత్రూమ్లో దాక్కున్న పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానంది దేవస్థానం కాలనీ పరిసరాల్లో విషసర్పాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అటవీ ప్రాంతం నుంచి పాములు జనావాసాల్లోకి ప్రవేశిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మహానంది కాలనీకి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి ఇంట్లోని బాత్రూమ్లో ఒక భయంకరమైన నల్లత్రాచు ప్రత్యక్షమైంది. బాత్రూమ్లో పామును చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. వెంటనే ఈశ్వర్ అప్రమత్తమై స్నేక్ క్యాచర్ మోహన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ సుమారు గంటపాటు శ్రమించి, బాత్రూమ్లో దాక్కున్న ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన త్రాచుపామును మోహన్ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. వర్షాకాలంలో పాములు పొదల నుంచి బయటకు వచ్చి ఇళ్లలోకి దూరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాములను స్వయంగా పట్టుకునే సాహసం చేయకుండా వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

