చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..
చాట్‌జీపీటీ వినియోగదారుల కోసం ఓపెన్‌ఏఐ కొత్త ప్రైవసీ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చడం కాకుండా, ప్రతి ఆప్షన్ ఏం చేస్తుందో అర్థం చేసుకుని సంబంధిత సెట్టింగ్‌కు వెళ్లేందుకు ఇది సహాయపడుతుంది. మెమరీ, పర్సనలైజ్డ్ యాడ్స్, లొకేషన్, టెంపరరీ చాట్, డేటా వినియోగం, మోడల్ ఇంప్రూవ్‌మెంట్, డేటా ఎక్స్‌పోర్ట్, అకౌంట్ డిలీట్ వంటి అంశాలను ఒకేచోట వివరిస్తుంది. వెబ్, iOS, Androidలో ఈ ఫీచర్ రోల్‌అవుట్ అవుతోంది.
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ , చాట్‌జీపీటీ వినియోగదారుల కోసం ఒక కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల ప్రైవసీ సెట్టింగ్‌లు, డేటా వినియోగంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా దీనిని డిజైన్ చేశారు. ఈ కొత్త సెంటర్ మీ ఖాతా మెనూలో కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న ప్రైవసీ కంట్రోల్స్ స్థానంలో ఇది రావడం లేదు. ఏ ప్రైవసీ ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుంది? ఏ మార్పులు చేయడానికి ఎక్కడ క్లిక్ చేయాలి? అనే విషయాలను వివరిస్తూ యూజర్లకు నేరుగా లింక్‌లు అందిస్తుంది. వెబ్ వర్షన్ తో పాటు iOS, ఆండ్రాయిడ్ యాప్‌లలో ఉచిత, ప్లస్, ప్రో మరియు బిజినెస్ ఖాతాదారులకు ఇది అందుబాటులోకి వస్తోంది. ఎంటర్‌ప్రైజ్, హెల్త్‌కేర్ ప్లాన్లకు ఇది వర్తించదు. ఈ ప్రైవసీ సెంటర్ సమాచారాన్ని మూడు ముఖ్యమైన విభాగాలుగా వర్గీకరించింది. ఇందులో మొదటిది పర్సనలైజ్డ్ చాట్స్ & అడ్వర్టైజ్‌మెంట్స్. మెమరీ ఫీచర్, లొకేషన్ వివరాలు మరియు ప్రకటనలు మీ అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇది వివరిస్తుంది. చాట్ డిలీట్ చేసినంత మాత్రాన అందులోని ‘మెమరీ’ డిలీట్ కాదని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. రెండోది..చాట్ ప్రైవసీ. తాత్కాలిక చాట్‌ల సమాచారాన్ని అందిస్తూ, వాటిని సులభంగా ప్రారంభించేందుకు సహాయపడుతుంది. ఇక మూడోది డేటా యూసేజ్ & యాక్సెస్. ఏఐ మోడల్ మెరుగుదల కోసం డేటా వినియోగం, థర్డ్-పార్టీ యాప్‌ల యాక్సెస్, మీ డేటాను డౌన్‌లోడ్ చేయడం లేదా ఖాతా తొలగింపు వంటి అంశాలను కవర్ చేస్తుంది. యూజర్లు తమ పరికరాన్ని బట్టి Privacy Centerను తెరవవచ్చు. కంప్యూటర్ లేదా వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్లి.. ChatGPT ఖాతాలోకి లాగిన్ అవ్వండి. మీ అకౌంట్ మెనూను ఓపెన్ చేయండి. అక్కడ Help అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. Privacy Centerపై క్లిక్ చేయండి. ఇక Android, ఐ ఫోన్లలో అయితే..ChatGPT యాప్‌ను ఓపెన్ చేసి, Settingsలోకి వెళ్లండి. Privacy Center ఎంపికను ఎంచుకోండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..
మెడలో కొండచిలువతో యువతి డ్యాన్స్.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే
స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
రైలు కంపార్ట్మెంట్లో భయానక దృశ్యం!

