పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం గిరిజన గ్రామాలను భయాందోళనకు గురిచేస్తోంది. బోలగొండలో రెండు పశువులపై దాడి చేసిన పులి, మర్రిపాలెం వద్ద మరో నాలుగు పశువులను చంపింది. ప్రస్తుతం చినకోరుమిల్లి గ్రామంలోని తోటల్లో పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. బందపల్లి, తాళ్లపాలెం, భీమవరం, పెద్దకొండ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా అడవుల్లోకి వెళ్లొద్దని, రాత్రివేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక గిరిజనులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో విరుచుకుపడుతున్న పులి, మూగజీవాలపై దాడులకు తెగబడుతోంది. బోలగోండ గ్రామంలో రెండు పశువులపై దాడి చేసిన పులి, నిన్న మర్రిపాలెం వద్ద ఏకంగా నాలుగు పశువులను పొట్టనబెట్టుకుంది. దీంతో పాడిపశువులను కోల్పోయిన రైతులు, గిరిజనులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం ఈ పెద్దపులి కదలికలను చినకోరుమిల్లి గిరిజన గ్రామంలోని తోటల్లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో బందపల్లి, తాళ్లపాలెం, భీమవరం, పెద్దకొండ గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా అడవిలోకి, తోటల్లోకి వెళ్లవద్దని, రాత్రి వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వాన, మరోవైపు పొంచి ఉన్న పెద్దపులి భయంతో ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని, అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని గిరిజన ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్
The Paradise: నాని ‘ప్యారడైజ్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఘనంగా దీపోత్సవం
తిరుప్పరంకుండ్రంలో వెలిగిన కార్తీకదీపం
డబ్బుల వర్షం కురిపిస్తామంటూ అఘోరీ పూజలు.. యువకుడు బలి!
గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. నకిలీ బంగారంతో బురిడీ
అనంత్ అంబానీ మంచిమనసు కాలు విరిగిన ఏనుగు పిల్లకు చికిత్స
రూ.40 లక్షలు ఇచ్చారు..తీరా కట్టలు విప్పిచూసి లబోదిబోమన్న వ్యాపారి

