AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న కరెంట్‌ బిల్లు ఛార్జీలు

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న కరెంట్‌ బిల్లు ఛార్జీలు

Phani CH
|

Updated on: Sep 27, 2026 | 12:17 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ వినియోగదారులకు ట్రూడౌన్‌ ద్వారా బిల్లుల్లో ఊరట లభించనుంది. APERC ఆదేశాల ప్రకారం విద్యుత్‌ కొనుగోలు వ్యయానికి సంబంధించిన అదనపు వసూళ్లను వినియోగదారులకు తిరిగి సర్దుబాటు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.923.5 కోట్ల మేర ట్రూడౌన్‌ నమోదైంది. డిస్కంల వారీగా యూనిట్‌కు సుమారు 13 పైసల మేర సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ మొత్తం భవిష్యత్‌ విద్యుత్‌ బిల్లుల్లో సర్దుబాటు కానుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు అందించింది. ‘ట్రూడౌన్’ ప్రక్రియ ద్వారా వినియోగదారుల కరెంట్ బిల్లుల్లో ఛార్జీల రాయితీని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. గత రెండేళ్లలో కలిపి దాదాపు రూ. 1,553 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇది గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులందరికీ గొప్ప ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. రాష్ట్రంలో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు.. సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణను పాటించడమే ఈ భారీ తగ్గింపునకు ప్రధాన కారణం. APERC తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 629 కోట్లను ట్రూడౌన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వచ్చే కరెంట్ బిల్లులలో సర్దుబాటు చేయాలని డిస్కంలను ఆదేశించింది. దీనికి తోడు, గత ఆర్థిక సంవత్సరం లోనూ ప్రభుత్వం రూ. 924 కోట్లను ట్రూడౌన్ చేసింది. దీనిఫలితంగా ఇప్పటికే ప్రతి యూనిట్ విద్యుత్ వినియోగంపై 13 పైసల చొప్పున ఛార్జీలను తగ్గిస్తూ వస్తున్నారు. వరుసగా రెండేళ్లలో దాదాపు రూ. 1,553 కోట్లను తగ్గించడం వల్ల అన్ని వర్గాల వినియోగదారుల జేబులపై భారం తగ్గనుంది. సాధారణంగా విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం పెరిగితే ‘ట్రూఅప్’ పేరిట వినియోగదారులపై అదనపు భారం వేస్తుంటారు. కానీ వ్యయం తగ్గడం వల్ల జరిగే ఈ ‘ట్రూడౌన్’ ప్రక్రియ వల్ల కస్టమర్ల బిల్లుల్లోనే నేరుగా డిస్కౌంట్ సర్దుబాటు కానుంది. పారదర్శక పాలన, విద్యుత్ రంగ సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాలకూట విషం.. సూదిమందులతో ప్రజలు, పశువుల ప్రాణాలతో చెలగాటం!

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి కేంద్రం కొత్త నిబంధనలు

The Paradise: ది ప్యారడైజ్’లో కయాదు పాత్రపై విమర్శలు..పెద్దిని చూసి కూడా ఓదెల ఇలా చేశారా?

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!

విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్

Follow Us