AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: ది ప్యారడైజ్’లో కయాదు పాత్రపై విమర్శలు..పెద్దిని చూసి కూడా ఓదెల ఇలా చేశారా?

The Paradise: ది ప్యారడైజ్’లో కయాదు పాత్రపై విమర్శలు..పెద్దిని చూసి కూడా ఓదెల ఇలా చేశారా?

Phani CH
|

Updated on: Sep 27, 2026 | 12:11 PM

Share

నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’లో కయాదు లోహర్‌ పోషించిన సుబ్బు పాత్ర సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. కుటుంబ అప్పులు తీర్చేందుకు బీగ్రేడ్‌ సినిమాల్లో నటించే పరిస్థితిలోకి వెళ్లే యువతిగా ఆమె పాత్రను దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తీర్చిదిద్దారు. అయితే కొన్ని సన్నివేశాల్లో గ్లామర్‌ ప్రెజెంటేషన్‌, నాని పాత్ర చెప్పే సంభాషణలపై కొందరు ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం పాత్రను విమర్శించకుండా, దాని చిత్రీకరణపై చర్చించాలని అంటున్నారు.

నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’కు డీసెంట్ వస్తోంది.0 సినిమా కథ, నాని నటన, యాక్షన్ సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఈ చిత్రంలో కయాదు లోహర్ పోషించిన సుబ్బు పాత్ర మాత్రం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఆ పాత్రను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన విధానంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో సుబ్బు పాత్రకు సినీ నటి కావాలనే కోరిక ఉంటుంది. తల్లి వద్దని వారించినా మద్రాస్ వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. అయితే అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది. అదే సమయంలో తన తండ్రి చేసిన అప్పుల కారణంగా కుటుంబం ఎదుర్కొంటున్న అవమానాలను చూస్తుంది. ఎలాగైనా ఆ అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్న సుబ్బు.. డబ్బు కోసం బీ గ్రేడ్ చిత్రాల్లో నటించడం ప్రారంభిస్తుంది. ఇక్కడే ‘ది ప్యారడైజ్’లోని కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్బు నటించే బీ గ్రేడ్ చిత్రాలకు ‘చుక్క చిత్రాలు’ అనే పేరు పెట్టడం, వాటిని ప్రదర్శించే సన్నివేశాల్లో హీరోయిన్ పాత్రను చూపించిన తీరు అవసరానికి మించి గ్లామర్‌ను ప్రధానంగా చూపించిందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కథలో ఆ పాత్ర ఎదుర్కొంటున్న బాధ, పరిస్థితుల తీవ్రత ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ కావాల్సిన చోట.. కొన్ని సన్నివేశాలు వేరే విధంగా స్పందన తెచ్చుకున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు సుబ్బు నడుముపై ఉండే సీతాకోకచిలుక టాటూ కూడా కథలో కీలకంగా ఉపయోగించారు. బీ గ్రేడ్ చిత్రాల్లో ఆమె ముఖాన్ని చూపించకుండా ఆ టాటూ ద్వారా గుర్తుపట్టేలా సన్నివేశాలను రూపొందించారు. అయితే ఆ విషయాన్ని హీరో తెలుసుకున్న తర్వాత వచ్చే సన్నివేశంలో నాని చెప్పే కొన్ని సంభాషణలపైనా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహిళలను అవమానించేలా అనిపించే పదజాలాన్ని ఉపయోగించడంపై కొందరు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సుబ్బు పాత్ర వెనుక ఉన్న ఉద్దేశం భావోద్వేగంగా ప్రేక్షకులను కదిలించడమే అయి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కుటుంబ అప్పులు తీర్చడానికి ఒక యువతి తనకు ఇష్టం లేని మార్గంలోకి వెళ్లాల్సి రావడం, ఆ తర్వాత ఆ విషయం హీరోకు తెలియడం వంటి అంశాలతో బలమైన భావోద్వేగాన్ని పండించాలని దర్శకుడు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అయితే ఆ సన్నివేశాల చిత్రీకరణ కారణంగా ఆశించిన భావోద్వేగం కంటే భిన్నమైన స్పందన వచ్చిందని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది కయాదు లోహర్ సన్నివేశాలనే సినిమాకు సంబంధించిన చర్చలో ప్రధాన అంశంగా మార్చుకుని ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు పెద్ది సినిమాలో జాన్వీని అలా చూపించినందుకు బుచ్చి దొరికిపోయాడు.. అదే బాటలో ఓదెల కూడా నడిచారంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ పాత్రను విమర్శించాల్సిన అవసరం లేదని, పాత్రను ఎలా రాశారు, ఎలా చూపించారు అనే అంశంపైనే చర్చ జరగాలని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!

విద్యార్థులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్

పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు

నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌

The Paradise: నాని ‘ప్యారడైజ్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

Follow Us