హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో సాయంత్రం నుంచి నాన్‌స్టాప్‌గా వర్షం కురిసింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా.. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సెంట్రల్, ఈస్ట్, సౌత్ హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 6:10 నుంచి 7:20 గంటల మధ్య కోర్ సిటీలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, పశ్చిమ హైదరాబాద్‌ను వానలు ముంచెత్తడంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని నగరవాసులకు అధికారుల సూచనలు చేశారు.
కాగా భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అయితే.. ఇవాళ రాత్రికి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!
