అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. బాలయ్య సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ప్రగ్యాజైస్వాల్
మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది
మిర్చీ లాంటి కుర్రాడు
ఈ మూవీ తర్వాత ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాలో వరుణ్ తేజ సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
కంచె మూవీ
ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చాలా సినిమాల్లో నటించి, మెప్పించింది.
వరస సినిమాలు
కానీ ఈ సినిమాలు ఏవీ ఈ అమ్మడుకు మంచి ఫేమ్ తీసుకరాలేకపోయాయి. కానీ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన ఛాన్స్ వచ్చింది. బాలయ్య సరసన అఖండ సినిమాలో నటించి మొదటిసారి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
బాలయ్య మూవీస్
ఈ సినిమా హిట్ అయినా కానీ ఈ అమ్మడుకు ఊహించిన రేంజ్‌లో అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఇక రీసెంట్‌గా ఈ చిన్నది డాకు మహారాజ్ సినిమాతో మరోసారి బాలయ్య సరసన నటించి మెప్పించింది
అవకాశాలు
ఈ మూవీతో మరోసారి తన అభిమానులను పలకరించింది.ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది. అయినా కూడా ఈ అమ్మడుకు అంతగా అవకాశాలు రావడం లేదని సమాచారం.
బ్యూటిఫుల్ ఫొటోస్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ చాలా అందంగా ఉంది.