ఇఫ్తార్ విందు ప్రత్యేకం.. ఇంట్లో మటన్ హలీమ్ ఎలా చేయాలంటే?

Samatha

20 march 2026

రంజాన్ స్పెషల్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది హలీమ్. చాలా మంది దీనిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. చాలా మంది ఫేవరెట్ డిష్ ఇది.

రంజాన్ స్పెషల్

అయితే మీరు కూడా హలీమ్ తినాలి అనుకుంటున్నారా? అయితే బయట కాకుండా, దీనిని ఇంటిలోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

హలీమ్

కావాల్సిన పదార్థాలు : గోధుమ రవ్వ, మటన్, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు, మసాలాలు, లవంగాలు, యాలకులు.దాల్చిన చెక్క, కొత్తిమీర, పూదీన, నెయ్యి, నిమ్మరసం

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం : ముందుగా, ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ రవ్వ వేసి, పప్పులతో పాటు, రవ్వను శుభ్రంగా కడిగి దాదాపు రెండు గంటల పాటు  మెత్తగా అవ్వడానికి నానబెట్టాలి.

తయారీ విధానం

దీని తర్వాత మటన్‌ను ఒకసారి శుభ్రంగా కడిగి, బాగా మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టాలి. తర్వాత పప్పులు, గోధుమ రవ్వ వేసి మ రో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి.

మటన్ శుభ్రపరచడం

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీవేసి మంచిగా వేయించుకోవాలి.  తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చీ అన్నీ కుక్కర్‌లో వేసి మంచిగా వేయించుకోవాలి.

మెత్తగా ఉడకబెట్టడం

ఇవన్నీ మంచిగా కలిసి, బాగా ఉడకాలి. పప్పు కవ్వంతో కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేయాలి.  అంతే టేస్టీ టేస్టీ మటన్ హలీమ్ రెడీ.

బాగాకలపాలి

ఇది తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. రంజాన్ సమయంలో ఉపవాసం తర్వాత దీనిని తినడం వలన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

ఆరోగ్యానికి మంచిది