లిటిల్ హార్ట్స్ బ్యూటీకి క్యూ కడుతున్న ఆఫర్స్.. 

Rajeev 

21  march 2026

శివాని నాగారం.. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు టాలీవుడ్ లో తెగ వినిపిస్తుంది. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. 

సుహాస్ హీరోగా నటించిన అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్‌తో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది. 

 హీరోయిన్ గా అడుగుపెట్టక ముందు ఈ అమ్మడు షార్ట్ ఫిల్మ్స్ నటించి ఆకట్టుకుంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇక తొలి సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. ఆతర్వాత ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. 

ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఇటీవలే హే బలవంత్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. 

వరుసగా సక్సెస్ అందుకుంటున్న ఈ అమ్మడికి ఇప్పుడు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది ఈ చిన్నది.