మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం చెరువులో మొసళ్లు గేదెలపై దాడి చేస్తున్నాయి. మూడు రోజుల్లోనే నీరు తాగేందుకు వెళ్లిన రెండు గేదెలను మొసళ్లు చంపేశాయి. మొసళ్లను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరినా చర్యలు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.