AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D/O Prasad Rao Kanabadutaledu Review: ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎంగేజింగ్ ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్..!

రాజీవ్ కనకాల, వాసంతిక కీలక పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాదరావు. చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ యాంకర్ ఉదయభాను ఓ పవర్ఫుల్ పాత్రలో రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ వెబ్ సిరీస్‌పై ఆరంభం నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. దీనికి తోడు ప్రమోషనల్ వీడియోలు సైతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి.

D/O Prasad Rao Kanabadutaledu Review: 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ.. ఎంగేజింగ్ ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్..!
D/O Prasad Rao Kanabadutaledu Review
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Feb 28, 2026 | 3:16 PM

Share

రాజీవ్ కనకాల, వాసంతిక కీలక పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాదరావు. చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ యాంకర్ ఉదయభాను ఓ పవర్ఫుల్ పాత్రలో రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ వెబ్ సిరీస్‌పై ఆరంభం నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. దీనికి తోడు ప్రమోషనల్ వీడియోలు సైతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. భారీ అంచనాల మధ్య ZEE5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆడియన్స్‌ను ఈ క్రైమ్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం..

కథ:

నెల్లూరులో కిరాణా కొట్టు నడుపుకునే ఓ సాధారణ మధ్య తరగతి తండ్రి ప్రసాదరావు (రాజీవ్ కనకాల). తన కూతురు (వాసంతిక మచ్చ) అంటే ఆయనకు ప్రాణం. ఆమెకు సంబంధించిన ఏ చిన్న పనైనా దగ్గరుండి చూసుకునేంత అతిప్రేమ ఆయనది. అలాంటి వాతావరణంలో పెరిగిన ఆ అమ్మాయికి హైదరాబాద్‌లో జాబ్ వస్తుంది. నాన్న ఎక్కడ ఒప్పుకోడో అన్న భయంతో, చుట్టాలందరినీ ఇంటికి పిలిపించి వారి ద్వారా ఒప్పించి మరీ హైదరాబాద్ వెళ్తుంది. కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిన ఆమె జీవితంలో.. సడెన్‌గా ఓ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కంగారు పడిన ప్రసాదరావు హుటాహుటిన హైదరాబాద్ చేరుకుంటాడు. అక్కడ ఆయనకు తన కూతురు చనిపోయిందనే గుండె పగిలే నిజం తెలుస్తుంది. అసలు ఆమె ఎలా చనిపోయింది..? ఈ డెత్ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ రెబెకా (ఉదయభాను) అండ్ టీమ్ ఎలా ఇన్వెస్టిగేట్ చేసింది? తన కూతురి చావుకు కారణమైన వారిని ప్రసాదరావు ఎలా పట్టుకున్నాడు..? అనేది మిగిలిన కథ.

కథనం:

దర్శకుడు ప్రమోషనల్ కంటెంట్‌తోనే అసలు కథేంటి అనేది ఆడియన్స్‌కు ఒక హింట్ ఇచ్చేశాడు. ఎపిసోడ్స్ మొదలైన తర్వాత.. కూతురు మిస్ అవ్వడం, పోలీసుల గాలింపు వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. అయితే, పోలీసులకు దొరకని ఆచూకీని తండ్రి ప్రసాదరావు చాలా సులువుగా కనిపెట్టేయడం కాస్త సినిమాటిక్ లిబర్టీ అనిపించినా.. కథా గమనంలో అది కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది. అమ్మాయి మరణం కన్ఫర్మ్ అయిన తర్వాత స్క్రీన్ ప్లే స్పీడ్ అందుకుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటీని రేకెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపించినా, చాలా చోట్ల అంచనాలను మించేలా కథనాన్ని నడిపించాడు. ఎక్కడా ల్యాగ్ లేకుండా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు.

ముఖ్యంగా పోలీసులకు సాధ్యంకాని కేసును తండ్రి స్వయంగా ఛేదించి, క్లైమాక్స్‌లో రివీల్ చేసే పాయింట్ హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, ఒక్కో ఎపిసోడ్ అరగంటలోపే ఉండటం వల్ల ఓ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. చిన్న చిన్న లాజిక్స్ పక్కనపెడితే.. ఓవరాల్‌గా డైరెక్టర్ మ్యాజిక్ వర్కౌట్ అయింది. కాకపోతే ఇందులో చూపించిన రివెంజ్ యాంగిల్ కాస్త వాస్తవానికి దూరంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు:

ఈ సిరీస్ మొత్తానికి ప్రధాన బలం రాజీవ్ కనకాల. తన సెటిల్డ్ యాక్టింగ్‌తో వన్ మ్యాన్ షో లాగా సిరీస్‌ను తన భుజాలపై నడిపించారు. ఓ మిడిల్ క్లాస్ తండ్రి ఆవేదనను అద్భుతంగా పండించారు. కూతురి పాత్రలో వాసంతిక న్యాచురల్ గా నటించి మెప్పించింది. చాలా ఏళ్ల తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన ఉదయభాను.. ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించింది. గాయత్రి భార్గవి కూడా బాగా నటించింది. మిగిలిన నటీనటులంతా తమ పరిధి మేరకు బాగానే చేశారు.

టెక్నికల్ టీం:

టెక్నికల్ గా చూస్తే.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది అనడంలో సందేహం లేదు. పాటలకు స్కోప్ లేకపోయినా, బిజిఎం మాత్రం సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది.. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కథకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్ గా డాటర్ అఫ్ ప్రసాద్ రావు.. ఎంగేజింగ్ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ..!

Follow Us