AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధురంధర్ 2కు స్టార్ డైరెక్టర్స్ రివ్యూ..! రాజమౌళి అలా.. రామ్ గోపాల్ వర్మ ఇలా..

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ధురంధర్ 2 ది రివెంజ్. సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ వోల్టెజ్ యాక్షన్ థ్రిల్లర్ ఉగాది కానుకగా మార్చి 19న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ తో అదరగొట్టేసింది.

ధురంధర్ 2కు స్టార్ డైరెక్టర్స్ రివ్యూ..! రాజమౌళి అలా.. రామ్ గోపాల్ వర్మ ఇలా..
Dhurandhar 2
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2026 | 9:48 AM

Share

బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ 2 సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ బాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దుమ్మురేపింది. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ 1 భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ధురంధర్ ది రివెంజ్ సినిమా మార్చ్ 19న విడుదలైంది. ఈ సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి షో నుంచి సెన్సేషనల్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

థియేటర్స్ లో ఈ సినిమాను ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ధురంధర్ 2 సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ సినిమాపై ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా ధురంధర్ 2 సినిమా పై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో ఈమేరకు రాజమౌళి ట్వీట్ చేశారు. “నాకు ధురందర్-1 చాలా నచ్చింది , కానీ ‘ది రివెంజ్’ పరిమాణంలోనూ, ఆత్మలోనూ అసలు చిత్రాన్ని మించిపోయింది. రచన, నటీనటుల ఎంపిక, టెక్నీషన్స్, సంగీతం, మేకింగ్ అలాగే దర్శకత్వం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. స్టోరీ, అలాగే ట్విస్ట్ లు, భావోద్వేగాలతో నిండిన నిజమైన ఉత్కంఠను సృష్టించాయి. ఆదిత్య ధర్  మీరు అద్భుతం సృష్టించారు. 4 గంటల నిడివి ఉన్న సినిమాను తీసి విడుదల చేయడానికి చాలా ధైర్యం కావాలి. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయారు. రణవీర్ సింగ్ అద్భుతంగా నటించాడు, అలాగే ఆర్ మాధవన్ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఘన విజయం సాధించిన టీమ్ కు అభినందనలు అంటూ రాజమౌళి రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే రామ్ గోపాల్ వర్మ. ఇది ఒక భయంకరమైన సినిమా. తెలివి తక్కువ, అతిశయోక్తితో కూడిన సినిమాలతో తమ కెరీర్‌ను, సంపదను నిర్మించుకున్న సినీ దర్శకులందరికీ ఇది ఒక పీడకల. ఇప్పటికీ ఆ దైవసమానమైన హీరోని ఆరాధించే ప్రతి సినీ దర్శకుడి ప్రాణం తీసేంత భయాన్ని కలిగిస్తుంది ధురంధర్ 2 అంటూ రాసుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us