AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

V. V. Vinayak: రెండు రోజుల్లో స్టోరీ రాసా..! కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది..

ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోయారు వివి వినాయక్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న వివివినాయక్ ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు. చివరిగా ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

V. V. Vinayak: రెండు రోజుల్లో స్టోరీ రాసా..! కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది..
Vv Vinayak
Rajeev Rayala
|

Updated on: Mar 20, 2026 | 11:11 PM

Share

దర్శకుడు వి.వి. వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ యాక్షన్ సినిమాలకు వినాయక్  పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొంటాయి. ఒకానొక సమయంలో భారీ హిట్స్ అందుకున్న వి.వి. వినాయక్ ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. చివరిగా బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతి సినిమాను రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు ఆయన తిరిగి సినిమాలు చేస్తూ బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వి.వి. వినాయక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా జూ. ఎన్టీఆర్ తో ఆయన తెరకెక్కించిన ఆది సినిమా గురించి అనేక ఆసక్తికర, అంతగా తెలియని విషయాలను పంచుకున్నారు.

ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అవమానించారు.. షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లా..

వి.వి. వినాయక్ మాట్లాడుతూ..  ఆది సినిమా ఆకస్మికంగా ప్రారంభమైంది. చెప్పాలని ఉంది సినిమా షూటింగ్ నిమిత్తం వినాయక్ తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లారట. అక్కడ అనూహ్యంగా జూ. ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. అప్పటికే వినాయక్ వద్ద వేరే కథ సిద్ధంగా ఉన్నప్పటికీ, తన స్నేహితుడు జూ. ఎన్టీఆర్ కు వినాయక్ ఒక మంచి కథ చెప్పాలని కోరాడట. తారక్ ఆ కథ వినడానికి అంగీకరించారు. అయితే, కథా చర్చల మధ్యలో తారక్ స్నేహితుడు కొడాలి నాని అనూహ్యంగా అక్కడకు వచ్చి, జూ. ఎన్టీఆర్ పక్కన నిలబడి మాకు మాస్ కథ కావాలి అని వినాయక్‌ను కోరారట. కొడాలి నాని కోరడంతో  వినాయక్ కేవలం రెండు రోజుల్లోనే “ఆది” సినిమా కథను రాశారట. ఆ సమయంలో “ప్రూవ్ చేసుకోవాలనే కసి” తప్ప మరే ఇతర ఆలోచనలు లేవని వినాయక్ గుర్తు చేసుకున్నారు.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

జూ. ఎన్టీఆర్ సామర్థ్యంపై వినాయక్‌కు మొదటి నుంచి నమ్మకం ఉండేది. తారక్ మొదటి చిత్రం “నిన్ను చూడాలని” విడుదలైనప్పుడు ఆయనకు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. రామోజీరావు గారు ఈ సినిమాను థియేటర్ కు తీసుకెళ్లి చూపించారని వినాయక్ తెలిపారు. నిన్ను చూడాలని క్లైమాక్స్ సన్నివేశంలో తారక్‌ను పొడిచిన తర్వాత, ఆయన “ఏయ్!” అని మాస్‌గా అరుస్తాడు. ఆ సన్నివేశం వినాయక్‌ను బాగా ఆకట్టుకుందట. “అలాంటి మాస్ ఎమోషన్ చూసిన తర్వాత, తారక్‌తో ఒక పెద్ద సినిమా చేయవచ్చని నాకు అనిపించింది,” అని వినాయక్ పేర్కొన్నారు. అప్పటికి తారక్ కేవలం “రామాయణం” లాంటి బాలనటుడి పాత్రలు మాత్రమే చేసి ఉండటంతో, యాక్షన్ హీరోగా ఆయన ఎలా ఉంటారో ఎవరికీ అంచనా అందలేదని వినాయక్ అన్నారు. జూ. ఎన్టీఆర్ “స్టూడెంట్ నెం.1” సినిమాతో భారీ విజయం సాధించిన తర్వాత “ఆది” వచ్చింది. ఈ సినిమాతో ఆయన మాస్ యాక్షన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని వివి వినాయక్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో….

OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us