AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush : ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ కామెంట్స్ వెనక అర్థం అదేనా..?

తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు మన దగ్గర కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంటాయి. అలాగే ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. అయితే ఇప్పుడు ధనుష్ రాజకీయాల్లోకి రానున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది..

Dhanush : ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ కామెంట్స్ వెనక అర్థం అదేనా..?
Dhanush
Praveen Vadla
| Edited By: |

Updated on: Jul 27, 2026 | 12:33 PM

Share

తమిళ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారంటూ కోలీవుడ్ వర్గాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన తన అభిమాన సంఘం సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి. సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, సమాజంలో మార్పు కోసం అభిమానులంతా ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి తోడు ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ప్రత్యేకంగా ఒక జెండాను కూడా ఆవిష్కరించి, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలను ముమ్మరం చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. పైగా ధనుష్ కూడా కేవలం సినిమా వేడుకల్లో కాకుండా మీ మీ ప్రాంతాల్లో ఉండే సమస్యలను తెలుసుకోండి.. సంక్షేమం కోసం అడుగేయండి అంటూ పిలుపిస్తున్నారు. ఈ కామెంట్స్ కూడా ఆయన రాజకీయ అరంగేట్రంపై ఆసక్తి రేపుతున్నాయి.

ఇప్పటికే కోలీవుడ్ దళపతి విజయ్ సొంతంగా తమిళ వెట్రి కళగం పార్టీ పెట్టి తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే బాటలో నడుస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విజయ్ లాగే ధనుష్ కూడా తన అభిమాన సంఘాలను ముందుగా సేవా మార్గంలోకి మళ్లించి, ఆ తర్వాత రాజకీయ అడుగులు వేసే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే, తన పొలిటికల్ ఎంట్రీపై ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరోవైపు నేషనల్ అవార్డ్స్ మీద కూడా ఓపెన్ అయ్యారు ఈయన. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రానికి స్పెషల్ మెన్షన్.. ఆయన దర్శకత్వం వహించిన ‘రాయన్’ సినిమాకు ఉత్తమ తమిళ చిత్ర అవార్డు రావడంపై వస్తున్న విమర్శలపై ధనుష్ తాజాగా స్పందించారు. ఆ ఏడాది ‘రాయన్’ కంటే మెరుగైన సినిమాలు మహారాజా, మెయ్యళగన్ ఉన్నాయనే విషయాన్ని ఒప్పుకుంటూనే.. ఆయా చిత్రాల అభిమానుల భావోద్వేగాలను తాను పూర్తిగా గౌరవిస్తానని ఆయన హుందాగా పేర్కొన్నారు. గతంలో తాను నటించిన ‘పుదుపేట్టై, వడ చెన్నై, కర్ణన్’ వంటి అద్భుతమైన చిత్రాలకు అవార్డులు రానప్పుడు ఎవరూ మాట్లాడలేదని, కొన్నిసార్లు ఎంత కష్టపడినా అవార్డులు అయాచితంగానే కలిసివస్తాయని గుర్తుచేశారు. నెగెటివిటీని పక్కనబెట్టి ఒక తమిళ నటుడిగా ఒకే ఏడాది రెండు జాతీయ అవార్డులు సాధించినందుకు ఈ విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ధనుష్ పిలుపునిచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us