AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGpt Plus : ఏడాది పాటు ఫ్రీగా చాట్‌జీపీటీ ప్లస్‌.. ఎవరెవరికి ? ఎలా అప్లై చేయాలంటే ??

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది "చాట్‌జీపీటీ" (ChatGPT). ఇప్పుడు ఈ టెక్ దిగ్గజం మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఒక అద్భుతమైన బహుమతిని ప్రకటించింది. ఏడాది (12 నెలల) పాటు ప్రీమియం ‘చాట్‌జీపీటీ ప్లస్’ (ChatGPT Plus) సేవలు పూర్తిగా ఉచితంగా లభించనున్నాయి.

ChatGpt Plus : ఏడాది పాటు ఫ్రీగా చాట్‌జీపీటీ ప్లస్‌.. ఎవరెవరికి ? ఎలా అప్లై చేయాలంటే ??
Chat Gpt Plus
Korivi Jayakumar
|

Updated on: Nov 21, 2026 | 1:44 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది “చాట్‌జీపీటీ” (ChatGPT). ఇప్పుడు ఈ టెక్ దిగ్గజం మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఒక అద్భుతమైన బహుమతిని ప్రకటించింది. భారతదేశంలోని యూనివర్సిటీలు, ల్యాబ్‌లలో కొత్త ఆవిష్కరణల కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న పరిశోధకులకు తీపికబురు ప్రకటించింది. తమ ప్రతిష్ఠాత్మక ‘చాట్‌జీపీటీ ఫర్ అకడమిక్ రిసెర్చర్స్’ కార్యక్రమాన్ని మన దేశంలో కూడా విస్తరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త నిర్ణయంతో అర్హులైన భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఏడాది (12 నెలల) పాటు ప్రీమియం ‘చాట్‌జీపీటీ ప్లస్’ (ChatGPT Plus) సేవలు పూర్తిగా ఉచితంగా లభించనున్నాయి.

తొలి 50 వేల దరఖాస్తులకే.. లాటరీకి గుడ్‌బై!

కాగా ఓపెన్‌ఏఐ గతంలో ఈ గ్రాంట్ల కోసం లాటరీ పద్ధతిని అనుసరించగా.. ఈసారి ఆ విధానానికి స్వస్తి పలికింది. ‘ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందు’ (First-come, first-served) ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా 50 వేల కొత్త గ్రాంట్లను మంజూరు చేయనుంది. ఒక్కో గ్రాంట్ కింద ఒక ప్రధాన పరిశోధకుడితో పాటు అదే సంస్థకు చెందిన మరో ఇద్దరు సహచరులకు కలిపి మొత్తం మూడు చాట్‌జీపీటీ ప్లస్ సీట్లు ఏడాది పాటు ఉచితంగా అందునున్నాయి. తద్వారా మొత్తం 2 లక్షల మంది పరిశోధకులకు సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ వెల్లడించింది. జులైలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యానికి ఇది రెట్టింపు కావడం గమనార్హం. నవంబర్ 23, 2026 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి అర్హులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం ఉత్తమం.

దరఖాస్తుకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలు..

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా పరిశోధనా సంస్థల్లో ఫ్యాకల్టీ (అధ్యాపకులు) లేదా పోస్ట్‌డాక్టోరల్ పరిశోధకులై ఉండాలి.
  • గత మూడేళ్ల కాలంలో తమ విభాగంలో కనీసం ఒక్క పరిశోధనా పత్రమైనా (Research Paper) ప్రచురితమై ఉండాలి.

ఏ రంగాలకు ప్రాధాన్యం..

ఈ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కోసం లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ, మెటీరియల్స్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఎర్త్ సైన్సెస్, ఇంజినీరింగ్, గణితం, ఫిజిక్స్ రంగాల్లో పరిశోధనలు చేసే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఓపెన్‌ఏఐ నిర్వహించే ధ్రువీకరణ (Verification) ప్రక్రియలో అర్హత నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ టూల్‌ను కేవలం పరిశోధనా అవసరాలకు మాత్రమే వాడాలని వెల్లడించారు.

పని భారం తగ్గినుందా..

సంక్లిష్టమైన శాస్త్రీయ వ్యాసాలను విశ్లేషించడం, కొత్త ప్రాజెక్ట్ ప్రపోజల్స్ రాయడం, హైపోథసిస్‌లను పరీక్షించడం, కోడింగ్ లోపాలను సరిదిద్దడం (Debugging), భారీ డేటాను విశ్లేషించడం వంటి పనులకు పరిశోధకులకు చాలా సమయం పడుతుంది. చాట్‌జీపీటీ ప్లస్ అందుబాటులోకి రావడంతో ఈ పనులన్నీ చిటికెలో పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈ రకంగా శాస్త్రవేత్తలు తమ పూర్తి సమయాన్ని కొత్త ఆవిష్కరణలపై పెట్టే వీలు కలుగుతుందని తెలియజేస్తున్నారు.

అదనపు బెనిఫిట్స్..

ఇక కేవలం టూల్ ఇవ్వడమే కాకుండా, దాన్ని పరిశోధనల్లో ఎలా సమర్థవంతంగా వాడుకోవాలో ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. అలాగే ప్రపంచవ్యాప్త పరిశోధకులతో కలిసి పనిచేసే నెట్‌వర్క్ వేదికను కల్పించననున్నారు. పరిశోధకుల రహస్య డేటాకు పూర్తి భద్రత ఉంటుందని.. దాన్ని ఏఐ ట్రైనింగ్‌కు వాడబోమని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. అయితే ఇందులో కేవలం చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ మాత్రమే వస్తుందని.. డెవలపర్లకు ఉపయోగపడే ఏపీఐ (API) క్రెడిట్లు ఇందులో ఉండవని సంస్థ క్లారిటీ ఇచ్చింది.

Follow Us