AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అవమానించారు.. షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లా..

తెలుగు సినిమా ప్రపంచంలో తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన సహయ నటీనటులు చాలా మంది ఉన్నారు. చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి.. తమ నటనతో తెలుగు అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది గీతా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నటి.

ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అవమానించారు.. షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లా..
Actress Geeta Singh
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2026 | 9:06 PM

Share

లేడీ కమెడియన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు నటి గీత సింగ్. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తనదైన కామెడీ టైమింగ్, నటనతో జనాలను కడుపుబ్బా నవ్వించింది.ఆ తర్వాత అల్లరి నరేష్ నటించిన కితకితలు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. ఈ మూవీతో గీతా సింగ్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే గీతా సింగ్ సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఫ్యామిలీ సమస్యలతో సినిమాలకు దూరమైన ఆమె.. ఇప్పుడు మళ్లీ నటించేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడిప్పుడే సినీరంగంలో తిరిగి యాక్టివ్ అవుతుంది. ప్రస్తుతం గీత సింగ్ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

ఓ ఇంటర్వ్యూలో గీత సింగ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. స్టార్ డైరెక్టర్స్ తనను అవమానించారు అని తెలిపింది గీత సింగ్. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన  సరైనోడు సినిమాకు ఓ మంచి పాత్ర ఉందని ఆమెను పిలిచారట.. ఎంతో అందంతో షూటింగ్ కోసం సెట్స్ కు వెళ్లిన తర్వాత ఆమె చేయాల్సిన పాత్రను మరొకరితో చేయించారట.. పాత్ర ఇస్తా అని చెప్పి తీరా షూటింగ్ కు వెళ్లిన తర్వాత ఆ పాత్ర వేరొకరికి ఇవ్వడం చాలా బాధను కలిగించింది అని తెలిపింది గీత సింగ్. చాలా అవమానంగా ఫీల్ అయ్యాను.. దాన్ని భరించలేక అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయా అని తెలిపింది నటి గీత సింగ్.

ఏంటీ.. లిటిల్ సోల్జర్స్ చిన్నది ఈమేనా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తుందంటే

అలాగే రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ లోనూ తనకు అవమానం జరిగిందని తెలిపింది గీత సింగ్. రాజా ది గ్రేట్ సినిమా కోసం తనను సంప్రదించారని.. నెల రోజులు డేట్స్ కూడా బ్లాక్ చేశారని తెలిపింది గీత సింగ్. దాంతో ఆమె ఇతర సినిమా ఛాన్స్ లు కూడా వదులుకుందట. ఎప్పటికీ షూటింగ్ కోసం పిలవకపోవడంతో ఓ రోజు షూటింగ్ కు వెళ్లి చూడగా మరొక అమ్మాయితో ఆ పాత్ర చేయించేశారట.. అదేంటని దర్శకుడు అనిల్ రావిపూడిని అడిగితే.. నాకు తెలియదు, ఆఫీస్ వాళ్ళు చేశారేమో అని సమాధానం చెప్పారట..

ఇవి కూడా చదవండి

ఆ హీరోతో150సినిమాల్లో నటించా.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే : గిరిబాబు

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
బంగారం ధర ప్రతిరోజూ ఎందుకు మారుతుంది.. ధరను ఎవరు నిర్ణయిస్తారు?
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
ఆయన నా ఇంటికి వచ్చే ఆ వేషం వేయకు అని చెప్పాడు..
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..