AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..

ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెలరోజులోకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ సినిమా ఓటీటీలో రావడానికి రెడీ అవుతుంది. గత నెల విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది.

OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Mar 19, 2026 | 5:00 PM

Share

ప్రస్తుతం థిఏయస్ర్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నారు. ఉగాది, రంజాన్ సెలవలు కలిసి రావడంతో సినిమాలు థియేటర్స్ తోపాటు ఓటీటీలోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే థియేటర్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా, రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల పుణ్యమా అని కొత్త సినిమాలు నెలరోజుల్లోనే అభిమానులకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో ప్రతి శుక్రవారం విడుదలవుతుంటే.. ఆ సినిమాలు నెలరోజులకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ను డబుల్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలై మెప్పిస్తున్నాయి.ఇక ఇప్పుడు రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయినా హారర్ మూవీ ఒకటి ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

ఇక ఇప్పుడు ఓ తెలుగు హారర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవవడానికి రెడీ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు అమరావతికి ఆహ్వానం. సురేఖ వాణి కూతురు సుప్రీత నటించిన మొదటి సినిమా ఇది. సుప్రీతతోపాటు ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. గత నెల 13న థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

ఏంటీ.. లిటిల్ సోల్జర్స్ చిన్నది ఈమేనా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఏం చేస్తుందంటే

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈశ్వర్ (శివ కంఠంనేని) డిపార్ట్‌మెంట్‌ నుంచి సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. తన భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ), మరదలు భార్గవి (సుప్రిత)లతో కలిసి ప్రశాంతంగా గడుపుతుంటాడు. భార్గవికి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చి ఎక్కువ. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ దెయ్యం వీడియో వైరల్ అవుతుంది. అది చూసిన ఓ అజ్ఞాత వ్యక్తి… దమ్ముంటే అమరావతి అనే ఊరికి వచ్చి అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయని లైవ్‌లో నిరూపించమని సవాల్ విసురుతాడు. ఆ ఛాలెంజ్‌ని స్వీకరించి ఈశ్వర్ ఫ్యామిలీతో సహా అమరావతికి వెళ్తుంది భార్గవి. అక్కడ ఆ కుటుంబానికి ఎదురైన పారానార్మల్ అనుభవాలు ఏంటి? అసలు ఆ ఊరి జమీందారు వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్ నోర్హోన్హా) కథేంటి..? ఈశ్వర్ సస్పెన్షన్‌కి, ఈ ఊరికి ఉన్న లింక్ ఏంటి? అనే ట్విస్టుల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమా ఈ నెల 20న ( శుక్రవారం) ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలకానుంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఆ హీరోతో150సినిమాల్లో నటించా.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే : గిరిబాబు

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో