AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

64ఏళ్ల హీరోతో 27ఏళ్ల కుర్ర హీరోయిన్ రొమాన్స్.. కట్ చేస్తే సినిమా డబుల్ డిజాస్టర్

ప్రస్తుతం సినీరంగుల ప్రపంచంలో స్టార్ హీరోస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఆరు పదులు, ఏడు పదుల వయసులోనూ అటు సినిమాలు, ఇటు ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోలకు గట్టిపోటి ఇస్తున్నారు. అయితే మీకు తెలుసా.. ?సినియర్ హీరోలకు జతగా యంగ్ హీరోయిన్స్ జతకట్టిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.

64ఏళ్ల హీరోతో 27ఏళ్ల  కుర్ర హీరోయిన్ రొమాన్స్.. కట్ చేస్తే సినిమా డబుల్ డిజాస్టర్
Movie News
Rajeev Rayala
|

Updated on: Mar 21, 2026 | 10:03 PM

Share

ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర హీరోలే కాదు సీనియర్ హీరోలు కూడా వరుస సినిమాలతో దుసుకుపోతున్నారు. అంతే కాదు భారీ హిట్స్ కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే మన సీనియర్ హీరోలు వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. అంతే కాదు సీనియర్ హీరోలతో జతకట్టడానికి కుర్ర హీరోయిన్స్ కూడా వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే చాలా మంది కుర్ర హీరోయిన్స్ సీనియర్ హీరోలతో నటించి హిట్స్ అందుకున్నారు కూడా.. కొంతమంది కూతురు వయసున్న హీరోయిన్స్ తోనూ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. సినిమా అనేది వినోదం కోసమే.. సినిమాల్లో వయసును చూడరు. ఇటీవల సికిందర్ సినిమాల సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించడంపై ఏజే డిఫరెన్స్ అంటూ ట్రోల్స్ జరిగాయి. దీంతో విమర్శలపై గట్టిగానే స్పందించారు సల్మాన్.

కానీ గతంలో 64 ఏళ్ల స్టార్ హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్ నటించిన సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఎదో తెలుసా.? నటీనటులు ఎవరో తెలుసుకుందామా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో హీరోయిన్స్ ఎవరో కాదండి. సూపర్ స్టార్ రజినీకాంత్.. హీరోయిన్ సోనాక్షి సిన్హా. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా లింగా. డైరెక్టర్ కె. ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014లో విడుదలై డిజాస్టర్ అందుకుంది. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా సమయంలో రజినీ వయసు 64 సంవత్సరాలు.. కాగా.. సోనాక్షి వయసు కేవలం 27 సంవత్సరాలు కావడం గమనార్హం.

అయినప్పటికీ వీరిద్దరి జోడి తెరపై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సినిమాకు మాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది. తమిళ్ లో పర్లేదు అనిపించుకున్నా.. తెలుగులో ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రజినీకాంత్ వయసు 75 సంవత్సరాలు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. చివరగా కూలీ చిత్రంలో కనిపించారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలకపాత్రలు పోషించారు. రూ.350 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు ఇప్పుడు జైలర్ 2 చిత్రీకరణంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Rajinikanth

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర