AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే ఓటీటీలో బ్లాస్ట్ హిట్..

థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. థియేటర్స్ లో వచ్చిన టాక్ ప్రకారం ఓటీటీలోకి సినిమాలు వస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి

సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే ఓటీటీలో బ్లాస్ట్ హిట్..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2026 | 9:08 AM

Share

థియేటర్స్ లో ప్రస్తుతం ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సినిమాలు సందడి చేస్తున్నాయి. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ మంచి టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ రెండు సినిమాలు మార్చ్ 19న థియేటర్స్ లో విడుదలయ్యాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకుంటుంటే.. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.. అంతే కాదు థియేటర్స్ లో పెద్ద ఆకట్టుకొని సినిమాలు కూడా ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీలో హిట్ అయ్యి ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అలాంటి సినిమానే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ. ఈ సినిమా ఓ థ్రిల్లర్ మూవీ.

ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైనప్పుడు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రమోషన్స్ కూడా బాగానే చేసిన సినిమా థియేటర్స్ లో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో దర్శకుడు చెప్పుతో కొట్టుకున్నాడు కూడా.. ఆ వీడియో ఆ మధ్య తెగ వైరల్ అయ్యింది. మీకు ఇప్పటికే ఆ సినిమా ఎదో అర్ధమై ఉంటుంది. ఆ సినిమానే తెలుగులో విడుదలైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్. చాలా మందికి ఈ సినిమా విడుదలైందన్న విషయం కూడా తెలియకపోవచ్చు. ఈ సినిమాలో సత్య రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే సత్యం రాజేష్, ఉదయభాను కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా థియేటర్స్ లో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్స్ లో పెద్దగా పట్టించుకోని ఆడియన్స్ ఓటీటీలో ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా వరకు త్రిబాణధారి బార్బరిక్ అనే టైటిల్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఈ  అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థ్రిల్లర్ సినిమాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఈ సినిమాను అస్సులు మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us