AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా? కారణాలు ఏంటంటే?

ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల్లోనూ బంగారం ధరలు తగ్గుతున్నాయి. అమెరికన్ డాలర్ బలం పుంజుకోవడం, కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుండటంతో పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి కోల్పోతున్నారు. దీనివల్ల డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతున్నాయి. రాబోయే కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,000 వరకు పడిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Gold: అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా? కారణాలు ఏంటంటే?
Gold 3
SN Pasha
|

Updated on: Mar 22, 2026 | 9:30 AM

Share

సాధారణంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల్లో బంగారం ధరలు పెరుగుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి విరుద్ధంగా, బంగారం ధరలు తగ్గుతున్నాయి. విశ్లేషకుల ప్రకారం దీనికి ప్రధాన కారణం అమెరికన్ డాలర్ బలపడటమే. డాలర్ విలువ పెరిగినప్పుడు, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతాయి. దీంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు వెనుకంజ వేస్తారు, డిమాండ్ తగ్గుతుంది. ఫలితంగా ధరలు క్రమంగా పడిపోతాయి.

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీ రేట్ల పెంపుపై సంకేతాలు ఇస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు బంగారం వంటి లాభం ఇవ్వని ఆస్తుల కంటే బాండ్లు, బ్యాంక్ డిపాజిట్ల వైపు మళ్లుతారు. ఇది కూడా బంగారం ధర తగ్గడానికి మరో ముఖ్య కారణంగా మారింది. స్వల్పకాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,000 నుంచి రూ.1,47,000 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,000 వరకు పడిపోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంటే పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కరెన్సీ మార్పులు, వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరలపై కీలక ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు గ్లోబల్ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?