AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం ధరలు మళ్లీ డౌన్.. ఇవాళ ఒక్కరోజే భారీగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

బంగారం ధరలపై శుభవార్త. ధరలు ఒక్కరోజే భారీగా తగ్గాయి. గోల్డ్ రూ.3 వేల మేర తగ్గగా.. సిల్వర్ రూ.10 వేలు తగ్గింది. ధరలు తగ్గడం వరసగా నాలుగోరోజు. గత కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు క్రాష్ అవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో తగ్గుముఖం పడుతున్నాయి.

Gold Prices: బంగారం ధరలు మళ్లీ డౌన్.. ఇవాళ ఒక్కరోజే భారీగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..
Gold 3
Venkatrao Lella
|

Updated on: Mar 22, 2026 | 8:42 AM

Share

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. వరుసగా నాలుగో రోజులు గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. ఇది మహిళలకు శుభవార్తగా చెప్పవచ్చు. పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పసిడి ధరలు పతనం కావడంతో కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు. మొన్నటివరకు రేట్లు అధికంగా ఉండటంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ధరలు తగ్గడంతో బంగారం షాపులకు క్యూ కడుతున్నారు. ధరలు తగ్గుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆదివారం రేట్లు దేశంలోని వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు ఇలా..

-హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 1,45,970 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.2940 తగ్గింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,33,800 వద్ద ట్రేడవుతోండగా.. ఇది రూ.2750 పడిపోయింది.

-విజయవాడ, విశాఖపట్నంలో పై ధరలు కొనసాగుతున్నాయి.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,580కు చేరుకోగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,36,200గా ఉంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,45,970 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,800గా ఉంది.

-ఢిల్లీలో 24 క్యారెట్ల రేటు రూ.1,46,120 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,950 వద్ద కొనసాగుతోంది

వెండి ధరలు ఇలా..

-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గింది.

-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.50 లక్షల వద్ద ఉన్నాయి.

-చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.

-బెంగళూరులో కేజీ సిల్వర్ రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది.

Follow Us