AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: నేను చాలా సెన్సిటివ్‌.. అలాంటి ట్రోల్స్ వల్ల చాలా ఏడ్చా: శ్రీలీల

టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళ భాషలలో సినిమాలు చేస్తోందీ అందాల తార. ఇక ఉగాది కానుకగా మార్చి 19 శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Sreeleela: నేను చాలా సెన్సిటివ్‌.. అలాంటి ట్రోల్స్ వల్ల చాలా ఏడ్చా: శ్రీలీల
Sreeleela
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2026 | 8:24 AM

Share

అందాల భామ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులో తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల  తెలుగులో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. పెళ్ళిసందడి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల.. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో శ్రీలీల కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ అందరితో కలిసి నటించింది. కానీ హిట్స్ మాత్రం శ్రీలీలకు దక్కలేదనే చెప్పాలి.

తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు పది సినిమాల్లో నటించింది. వాటిలో హిట్ అయినవి రెండే రెండు సినిమాలు అందులో ఒకటి ధమాకా అయితే మరొకటి భగవంత్ కేసరి సినిమా..  అయితే భగవంత్ కేసరి సినిమా బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించింది. మార్చ్ 19న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ ఉన్న శ్రీలీల పై గతంలో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఫ్లాపుల కారణంగా శ్రీలీల ట్రోల్స్ బారిన పడింది.

ఇవి కూడా చదవండి

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పై వచ్చిన ట్రోల్స్ పై స్పందించింది శ్రీలీల. కెరీర్ బిగినింగ్ లో నేటిజివ్ ట్రోల్స్ విషయంలో చాలా భయపడ్డాను. కొన్నిసార్లు చాలా బాధగా అనిపించేది.. ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మా అమ్మతో  ఇదంతా నావల్ల అవుతుందా.? కాలేజీకి తిరిగెళ్లిపోనా.? అని అడిగాను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్‌. కానీ, ఇప్పుడు వాటిని దైర్యంగా ఎదుర్కొంటున్నా అని చెప్పుకొచ్చింది శ్రీలీల. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by SREELEELA (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us