Cross Fire: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో టీవీ9 క్రాస్‌ఫైర్
హైడ్రా చర్యలపై వస్తున్న విమర్శలకు కమిషనర్ రంగనాథ్ సమాధానమిచ్చారు. సంస్కరణలు ఎప్పుడో ఒకసారి ప్రారంభించాల్సిందేనని ఆయన అన్నారు. ప్రజలకు ఏ భూమి కొనాలి, ఏది కొనకూడదో ఇప్పుడు అవగాహన పెరుగుతోందని పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చామని, కానీ బస్తీలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. సున్నం చెరువు కబ్జా ప్రాంతంలో కూడా అన్ని ఇళ్లను కూల్చలేదని తెలిపారు. కబ్జాదారుల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారున్నారని, హైడ్రా ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు.
హైడ్రా చర్యలపై వస్తున్న విమర్శల నడుమ కమిషనర్ రంగనాథ్ టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారనే ఆరోపణలను ఆయన ఖండిస్తూ, చెరువుల కబ్జాలను మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా వచ్చిన తర్వాత వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయనే విమర్శలపై స్పందించిన ఆయన, బస్తీల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. అక్రమంగా పర్మిషన్లు తీసుకొని పేదలను మోసం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి పనులు చేపడితే ప్రారంభంలో వ్యతిరేకత సహజమని, కానీ పూర్తయ్యాక ప్రాంతాలు అందంగా మారతాయని పేర్కొన్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించామని రంగనాథ్ వెల్లడించారు.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

