అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
హైదరాబాద్‌లో యువత చేసే ప్రమాదకర బైక్ స్టంట్స్‌పై సీపీ సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. పెట్రోల్ బంకులో జరిగిన వీలింగ్ ఘటన వైరల్ కావడంతో, యువత తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను పణంగా పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం క్షణికావేశంలో చేసే పనులు తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగల్చవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు భద్రత పాటించాలని ఆయన నొక్కి చెప్పారు.
హైదరాబాద్ నగరంలో యువత పిచ్చి విన్యాసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో తమ ప్రాణాలతోనే కాకుండా, ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యువతకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా, ఓ పెట్రోల్ బంకులో యువకులు చేసిన బైక్ స్టంట్ వీడియోపై ఆయన ఘాటుగా స్పందించారు. నగరంలోని ఒక పెట్రోల్ బంకులో కొందరు యువకులు పెట్రోలు కొట్టించుకునేందుకు వచ్చారు. అదే బంకుకి మరికొందరు అమ్మాయిలు కూడా పెట్రోల్ కోసం వచ్చారు. ఆ అమ్మాయిలను చూసి ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. పెట్రోలు కొట్టించుకునేందుకు క్యూలో ఉన్నవారు ఒక్కసారిగా బైక్‌పై వీలింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ స్టంట్ అదుపు తప్పి పక్కనే ఉన్న మరో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో అక్కడున్న వాహనదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన సీపీ సజ్జనార్ తనదైన శైలిలో యువతకు చురకలు అంటించారు. “వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో, అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం!” అని విరుచుకుపడ్డారు. కేవలం ఒక్క క్షణం ‘షో’ కోసం, అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని ఆయన హెచ్చరించారు. “గుర్తుంచుకోండి.. మీరు చేసే వీలింగ్స్ మీ ఇంటి వద్ద మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి ఫీలింగ్స్ మిగల్చకూడదు” అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. క్షణికావేశంలో చేసే పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని యువతకు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
LPG Gas Cylinder: మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల షాక్ !!
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. దివ్య సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన
జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!
సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

