AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. దివ్య సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్

పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. దివ్య సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్

Phani CH
|

Updated on: Apr 30, 2026 | 3:49 PM

Share

నటుడు సత్యరాజ్ కుమార్తె, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దివ్య సత్యరాజ్ పెళ్లి వ్యవస్థ, జాతకాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి జీవించడానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదని, పిల్లల్ని కనడానికి కూడా వివాహం అక్కర్లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి.

తండ్రి పోలికలు కూతురుకి వస్తే అదృష్టం అంటారు. అలాంటిది అచ్చు గుద్దినట్టు తండ్రి రూపాన్నే పుణికి పుచ్చుకుంది నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య. వృత్తి రీత్యా దివ్య న్యూట్రిషనిస్ట్‌. ఇప్పుడు ఈ డాక్టర్ మాటల దెబ్బకి ‘హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే’ అని కొంత మంది నెటిజన్స్ పాడుకునే పరిస్థితి. తాజాగా దివ్య పెళ్లి వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వృత్తిరీత్యా పోషకాహార నిపుణురాలిగా, ‘మగిళ్‌మతి’ సంస్థ ద్వారా సామాజిక సేవకురాలిగా గుర్తింపు పొందిన ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు పెళ్లి అనే ఆచారంపై నమ్మకం లేదని, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి ఉండడానికి వివాహం అనే ముద్ర అవసరం లేదని తెలిపారు. రీసెంట్ గా ఒక ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దివ్య మాట్లాడుతు ‘పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ అవసరమని తను భావించడం లేదనీ ఒక పురుషుడు, ఒక స్త్రీ పరస్పరం ఇష్టపడితే కలిసి జీవించవచ్చు అని తెలిపింది. దానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదనీ పెళ్లి చేసుకుంటేనే పిల్లల్ని కనాలనే నిబంధన కూడా అక్కర్లేదనీ, తన వరకైతే పెళ్లి చేసుకోకుండానే తల్లిని కావడానికి సిద్ధమని చెప్పింది. ఒక మహిళకి తన శరీరంపై తన జీవిత నిర్ణయాలపై పూర్తి హక్కు ఉంటుందనీ, తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి సంప్రదాయాల కంటే మనసుల కలయికే ముఖ్యమని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె మాటలు వైరల్ అవ్వడమే కాకుండా వైరల్ కి సరికొత్త పదాన్ని కనిపెట్టాల్సిన పరిస్థితి. డాక్టరమ్మ అంతటితోనే ఆగలేదు. మూఢనమ్మకాలు, జాతకాలపై తన అభిప్రాయం బయటపెట్టింది. తన నాన్న నాస్తికుడు కావడంతో తన జాతకం రాయించలేదనీ, ఈ విషయంలో జాతకం లేని అమ్మాయిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని కూడా చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛకు ఆమె ఇస్తున్న ప్రాముఖ్యత ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో నెట్టింట కొంత మంది ఆమె అభిప్రాయాలతో ఏకీభవించగా, మెజారిటీ నెటిజన్స్ మాత్రం వ్యతిరేకించారు. పెళ్లి అనే పవిత్రమైన బంధం ఉంది కాబట్టే ఇంకా ఈ విశ్వం తన మనుగడని కొనసాగిస్తోందనీ, జాతకాలు అనేవి లేనప్పుడు రాత్రి, పగలు మాత్రం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కట్టప్ప డాటర్ దివ్య తన మాటలతో మంత్ ఎండ్ అని డల్‌గా ఉన్న వాళ్ళల్లో కూడా జోష్ ని తీసుకొచ్చింది. దివ్య సత్యరాజ్ కేవలం ఒక స్టార్ కిడ్ మాత్రమే కాదు. ఆమె భారతదేశంలోని అత్యుత్తమ న్యూట్రిషనిస్టులలో ఒకరు. విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఆమె, సినీ గ్లామర్‌కు దూరంగా ఉంటూ వైద్య, సామాజిక సేవా రంగాలను తన వృత్తిగా ఎంచుకున్నారు. ‘మగిళ్‌మతి’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. పోషకాహార రంగంలో ఆమె చేసిన కృషికి గానూ అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా వరించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చరణ్ మెరుపు సినిమా ఎందుకు మధ్యలోనే ఆగిపోయింది ??

Dacoit OTT: అప్పుడే OTTలోకి ‘డెకాయిట్’.. ఎప్పుడంటే

Michael: మైఖేల్‌ దెబ్బకు.. బద్దలైన ధురంధర్ 2 రికార్డ్

ఆ కారణంతోనే మతం మార్చుకున్నా.. అసలు విషయం చెప్పిన కార్తీక దీపం సుమిత్ర

Follow Us