AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dacoit OTT: అప్పుడే OTTలోకి 'డెకాయిట్'.. ఎప్పుడంటే

Dacoit OTT: అప్పుడే OTTలోకి ‘డెకాయిట్’.. ఎప్పుడంటే

Phani CH
|

Updated on: Apr 30, 2026 | 3:39 PM

Share

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'డెకాయిట్' థియేటర్లలో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. మే 8 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డెకాయిట్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ డెకాయిట్. షానీల్ డియో తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ మూవీలో విలన్ గా నటించారు. ఏప్రిల్ 10న రిలీజైన డెకాయిట్ సూపర్ హిట్ గా నిలిచింది. మూడు వారాల తర్వాత కూడా వీకెండ్స్‌లో మంచి బుకింగ్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓవరాల్ గా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా నిర్మాతలకు మంచి గానే లాభాలు తెచ్చిపెట్టింది. అడివి శేష్ నటన, మృణాల్ గ్లామర్, భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డెకాయిట్ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. డెకాయిట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం చిత్ర నిర్మాతలకు భారీగానే చెల్లించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మే 8 నుంచి డెకాయిట్ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఒకేసారి డెకాయిట్ మూవీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, స్ట్రీమింగ్ డేట్ దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌ సంయుక్తంగా డెకాయిట్ సినిమాను నిర్మించారు. ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల, జయన్ మేరీ ఖాన్, జరీనా వాహబ్.. ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Michael: మైఖేల్‌ దెబ్బకు.. బద్దలైన ధురంధర్ 2 రికార్డ్

ఆ కారణంతోనే మతం మార్చుకున్నా.. అసలు విషయం చెప్పిన కార్తీక దీపం సుమిత్ర

Follow Us