AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి

చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి

Phani CH
|

Updated on: Apr 29, 2026 | 6:42 PM

Share

గుజరాత్‌లో గుండె దడ పుట్టించే ఘటన వెలుగులోకి వచ్చింది. చిరుతపులి దాడి నుండి తన నాలుగేళ్ల కూతురిని రక్షించడానికి ఒక తండ్రి ప్రాణాలకు తెగించి ఒట్టి చేతులతో పోరాడాడు. తీవ్ర గాయాలైనప్పటికీ, తన బిడ్డను చిరుత నోటి నుండి విడిపించి ప్రాణాలతో కాపాడాడు. ఈ తండ్రి, కూతురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఇది తండ్రి ప్రేమకు, ధైర్యానికి నిదర్శనం.

గుజరాత్‌లోని ఛోటా ఉదైపూర్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఇప్పుడా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రస్లీ గ్రామంలో సురేష్ రాథ్వా అనే గిరిజన వ్యక్తి నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం.. సురేష్ నాలుగేళ్ల కుమార్తె ఇంటి వెనుక ఆడుకుంటోంది. ఆ సమయంలో అడవిలో నుంచి అకస్మాత్తుగా ఓ చిరుత వచ్చింది. ఒక్కసారిగా చిన్నారిపై దూకి నోట కరుచుకుని వెళ్లబోయింది. ముఖ్యంగా తన దవడలతో చిన్నారి మెడను గట్టిగా పట్టుకుని పరుగులు పెడుతుండగా.. ప్రాణభయంతో చిన్నారి కేకలు వేసింది. ఇది చూసిన తల్లి అక్కడికక్కడే కళ్లు తిరిగి పడిపోగా.. తండ్రి సురేష్ మాత్రం మెరుపు వేగంతో పులి దగ్గరకు చేరుకున్నాడు. కన్నతండ్రి కళ్లెదుటే నాలుగేళ్ల కూతురిని చిరుతపులి నోట కరుచుకుని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. తన బిడ్డ చిరుత నోట్లో ఉండటం చూసి సురేష్ మొదట షాకైనా.. మరుక్షణమే సింహంలా గర్జించాడు. అయితే, అది చూసిన ఆ తండ్రి భయపడలేదు. గుండె ధైర్యాన్ని కూడగట్టుకుని ఒక్కసారిగా ఆ క్రూర మృగంపైకి దూకాడు. చిరుత పులి పైకి లంఘించి దాని దవడలను తన చేతులతో బలవంతంగా విడదీశాడు. ఒక చేత్తో బిడ్డను గట్టిగా పట్టుకుని, మరో చేత్తో ఆ క్రూర మృగంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. చిరుతపులి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సురేష్‌పై పంజా విసురుతూ తీవ్రంగా దాడి చేసింది. సుమారు ఐదు నిమిషాల పాటు సాగిన ఈ భీకర పోరాటంలో ఒట్టి చేతులతో దాని దవడలను చీల్చి మరీ దాని నోటి నుంచి తన బిడ్డను విడిపించుకుని ప్రాణాలతో కాపాడుకున్నాడు సురేష్. సురేష్ తెగింపును చూసి వెనకడుగు వేసిన ఆ చిరుతపులి.. చివరికి తన పట్టును సడలించి బిడ్డను వదిలేసి పొలాల్లోకి పారిపోయింది. ఈ దాడిలో బాలిక ముఖం, మెడ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే సురేష్‌కు చిన్న చిన్న గాయాలు కాగా.. అప్పటికే అక్కడకు వచ్చిన స్థానికులు వెంటనే వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సురేష్ బాగానే ఉండగా.. అతడి కుమార్తె చికిత్సకు స్పందిస్తోందని, పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంపర్‌ ఆఫర్‌.. సిమ్‌ కొంటే పెట్రోల్‌ ఫ్రీ

Divvela Madhuri: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాధురి..

సాక్షి ధోనీ ధరించిన.. వాచీ ధర రూ. 3.1 కోట్లు!

భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్‌

పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..

Follow Us