పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
రాజస్థాన్‌లోని అల్వార్‌లో సోషల్ మీడియా రీల్ సరదా ఓ యువకుడికి ప్రాణసంకటం తెచ్చింది. కాలూరామ్ అనే యువకుడి తల 15 లీటర్ల పాల డబ్బాలో ఇరుక్కుపోవడంతో గ్రామస్థులు, హార్డ్‌వేర్ షాపు వారు అతికష్టం మీద రక్షించారు. ఈ రెస్క్యూ వీడియో వైరల్ కావడంతో, ఇటువంటి ప్రమాదకరమైన రీల్ స్టంట్స్‌పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
రాజస్థాన్‌లో ఓ యువకుడికి సోషల్ మీడియా రీల్ సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. సరదా కోసం చేసిన ఓ స్టంట్ వికటించడంతో అతడి తల ఓ స్టీల్ పాల డబ్బాలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్వర్ జిల్లా మధోగఢ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాలూరామ్ అనే యువకుడు గోధుమలు అమ్మేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి, అదే సమయంలో ఓ రీల్ చిత్రీకరించడానికి తన వెంట ఉన్న 15 లీటర్ల పాల డబ్బాను తలపై పెట్టుకున్నాడు. కానీ, ఊహించని విధంగా అది తలకు బిగుసుకుపోయి బయటకు రాలేదు. ఎంత ప్రయత్నించినా డబ్బా రాకపోవడంతో కాలూరామ్ కేకలు వేశాడు. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 10 కిలోల బరువున్న ఆ డబ్బాను తీయడం ఎవరివల్లా కాలేదు. దీంతో అతడిని దగ్గరలోని ఓ హార్డ్‌వేర్ షాపునకు తీసుకెళ్లి, డబ్బాను జాగ్రత్తగా కట్ చేయడం ప్రారంభించారు. గ్రైండర్‌తో కట్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా యువకుడికి ప్రమాదమని అందరూ ఆందోళన చెందారు. చివరకు సురక్షితంగా డబ్బాను తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గంటల తరబడి నరకయాతన అనుభవించిన అతడిని గ్రామస్థులు అతి కష్టం మీద కాపాడారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేసవిలోనూ మీ జుట్టును కాపాడుకోండి ఇలా..!
విశాఖ జూలో ‘ఘోస్ట్ ఆఫ్ జంగిల్’
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ
ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

