AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

Phani CH
|

Updated on: Apr 29, 2026 | 4:11 PM

Share

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సమలు మరకామ్ భార్య థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమెను కాపాడేందుకు సమలు ఆస్తులన్నీ అమ్మేశాడు, బైక్‌ను అంబులెన్స్‌గా మార్చి వందల కి.మీ ప్రయాణించాడు. మెరుగైన వైద్యం కోసం పోరాడుతూ, అధికారులను ఆశ్రయించగా, వారు వెంటనే సహాయం చేశారు. ఇది వివాహ బంధానికి నిజమైన అర్ధాన్ని చాటుతున్న అద్భుతమైన ప్రేమ, త్యాగ గాథ.

భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కష్టసుఖాల్లో కలకాలం భర్తకు తోడునీడగా ఉంటానని వధువు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భార్యకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటానని వరుడు, వేదపండితులు, పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో అగ్నిసాక్షిగా వివాహబంధంతో ఒక్కటవుతారు. ఈ వివాహ బంధం ఎంతో పవిత్రమైనది.. బలమైనది. అయితే ప్రస్తుత కాలంలో ఈ వివాహ బంధం బలహీనపడుతోంది. చిన్న చిన్న విషయాలకే భార్యభర్తలు విడిపోతున్నారు. అలాంటిది అనారోగ్యం పాలై.. చికిత్స కోసం ఆస్తులన్నీ హరించుకుపోయినా భార్యను విడిచిపెట్టలేదు ఆ భర్త. వివాహబంధానికి నిజమైన అర్ధాన్ని చాటుతూ భార్యను బ్రతికించుకోడానికి అతను చేస్తున్న పోరాటం అందరినీ కదిలిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సమలు మరకామ్ భార్య థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతోంది. తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలని నిర్ణయించుకున్న సమలు ఖర్చుకు వెనుకాడలేదు. వైద్యం కోసం తనకున్న భూమి, ఇల్లు, ఆభరణాలను కూడా అమ్మేశాడు. తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి వీలుగా తన ద్విచక్ర వాహనాన్నే అంబులెన్సుగా మార్చుకున్నాడు. గత రెండేళ్లుగా భార్యను బైకుపై పడుకోబెట్టుకుని వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ముంబయి వరకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆ భర్త గుండె పగిలిపోయింది. చివరకు ఆమెను కబీర్‌ధామ్‌ కలెక్టరేటుకు తీసుకువెళ్లి, తన దయనీయ పరిస్థితిని అధికారుల ముందు విన్నవించుకున్నాడు. భర్తగా సమలు మరకామ్ పడుతున్న వేదనను, ఆపదలో ఉన్న ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి, ఆమెను జిల్లా ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఒక భర్తగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచాడు సమలు. ఆమె త్వరగా కోలుకోవాలని ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆసుపత్రి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసిన పేషంట్లు.. ఏం జరిగిందంటే

ఎండలకు పొట్ట ఉబ్బరమా ?? మీ మీల్ ప్లాన్ ఎలా ఉండాలంటే !!

వేసవిలో ‘సైలెంట్ కిల్లర్‌’ లోలోపలే ఉడికిపోతున్న జనం !! ఏసీలో ఉన్నా తప్పని ముప్పు !!

Chiyaan Vikram: యంగ్ లుక్‌ కోసం రిస్క్‌ చేసిన విక్రమ్‌

షాకింగ్! మసాజ్ కోసం.. ఏకంగా రూ.7.25 లక్షలు ఖర్చు చేసిన హీరోయిన్..

Follow Us