AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiyaan Vikram: యంగ్ లుక్‌ కోసం రిస్క్‌ చేసిన విక్రమ్‌

Chiyaan Vikram: యంగ్ లుక్‌ కోసం రిస్క్‌ చేసిన విక్రమ్‌

Phani CH
|

Updated on: Apr 29, 2026 | 3:55 PM

Share

సెలబ్రిటీలు అందంగా, యవ్వనంగా కనిపించడం ముఖ్యం. ఇటీవల చియాన్ విక్రమ్ తన వయసు కంటే చాలా యంగ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది విదేశాల్లో చేయించుకున్న ఆధునిక కాస్మోటిక్ ట్రీట్‌మెంట్‌ల ఫలితమని కొందరు అంటుంటే, మరికొందరు ఆయన సహజ పద్ధతులు, ఆరోగ్యకరమైన అలవాట్లే కారణమని చెబుతున్నారు. విక్రమ్ యవ్వన రూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇంకా సస్పెన్సే.

సెలబ్రిటీలకు అందంగా.. యవ్వనంగా కనిపించడం చాలా ముఖ్యం. అందుకే అందం వెనక.. యవ్వనం వెనక దాదాపు సినిమా స్టార్లందరూ పరుగెడుతుంటారు. అందుకోసం కొందరు నాచురల్‌ వేస్‌లో అందంగా.. ఫిట్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తే.. మరికొందరు మాత్రం సర్జరీలను నమ్ముకుంటూ ఉంటారు. రిస్క్‌ చేసి మరీ షార్ట్‌ కట్‌లో తన లుక్‌ను మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ కూడా ఇదే చేశాడని కోలీవుడ్‌లో అందరూ అనుకుంటున్నారు. ఫిల్మ్ కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసిన విక్రమ్.. ఆ సినిమాల్లోని పాత్రల కోసం ఫిజికల్‌గా.. మెంటల్‌గా ఎంతో కష్టపడ్డాడు. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. ఇక రీసెంట్‌గా తన బర్త్‌ డే రోజు.. విక్రమ్‌ ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ ఫాస్ట్ చేస్తూ కనిపించాడు. అయితే 60 ఏళ్ల వయసులోనూ విక్రమ్‌ చాలా యంగ్‌ గా కనిపించడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. తన వీడియోలతో, ఫోటోలతో నెట్టింట వైరల్ అయ్యాడు. అయితే విక్రమ్‌ అలా యంగ్‌గా కోసం రిస్క్ చేశాడని కోలీవుడ్ న్యూస్.యవ్వనంగా కనిపించేందుకు విక్రమ్‌ సర్జరీ చేయించుకున్నారట. విదేశాల్లో ఆయన త్యాధునిక కాస్మోటిక్ ట్రీట్‌మెంట్‌లు చేయించుకోవడం వల్లే ఇలా యంగ్‌గా కనిపిస్తున్నాడని కోలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే ప్రకృతి వైద్యం, ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల చియాన్‌లో ఈ మార్పు వచ్చిందని ఆయన ఫ్యాన్స్‌ చెబుతున్నారు. మరి విక్రమ్‌ సర్జరీ చేయించుకున్నారా? లేక నాచురల్‌గానే యవ్వంగా మారిపోయారా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షాకింగ్! మసాజ్ కోసం.. ఏకంగా రూ.7.25 లక్షలు ఖర్చు చేసిన హీరోయిన్..

Follow Us