AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో 'సైలెంట్ కిల్లర్‌' లోలోపలే ఉడికిపోతున్న జనం !! ఏసీలో ఉన్నా తప్పని ముప్పు !!

వేసవిలో ‘సైలెంట్ కిల్లర్‌’ లోలోపలే ఉడికిపోతున్న జనం !! ఏసీలో ఉన్నా తప్పని ముప్పు !!

Phani CH
|

Updated on: Apr 29, 2026 | 3:59 PM

Share

ఎండలు మండిపోతున్న ఈ సమయంలో 'సైలెంట్ హీట్ స్ట్రెస్' ప్రాణాంతకం కావచ్చు. శరీరం చల్లబరచుకునే శక్తిని కోల్పోయి, చెమట పట్టడం ఆగిపోవడం, తీవ్రమైన నీరసం వంటివి దీని లక్షణాలు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. నీరు ఎక్కువగా తాగి, ఉదయం వేళల్లోనూ అప్రమత్తంగా ఉండటం ద్వారా ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

ఎండలు మండుతున్నాయి.. మధ్యాహ్నం మాత్రమే కాదు, ఉదయం వేళల్లో కూడా సూర్యుడు సెగలు గక్కుతున్నాడు. మాడు పగిలే ఎండలకు తోడు ఉక్కపోత… జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోడ్ల మీదకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఇక ఢిల్లీలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. రోజూ అలవాటుగా మార్నింగ్ వాక్‌కు వెళ్లిన 62 ఏళ్ల వ్యక్తి, ఎండ దెబ్బకు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అసలు ఏం జరిగింది? వైద్యులు చెబుతున్న ఆ ‘సైలెంట్ హీట్ స్ట్రెస్’ అంటే ఏమిటి? లోలోపలే బాడీని హీట్ చేస్తూ ప్రాణాల మీదకు తెస్తున్న ఈ సైలెంట్ కిల్లర్ లక్షణాలేంటి? దీని నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? పరిష్కారమేంటి? 62 ఏళ్ల ఓ వ్యక్తికి బీపీ, షుగర్ ఉండటంతో పాటు గుండెలో స్టెంట్ కూడా ఉంది. అందుకే ఆయన ఎప్పుడూ ఎండల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. మధ్యాహ్నం పూట అస్సలు బయటకు వచ్చేవారు కాదు. కానీ, ఒకరోజు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య వాకింగ్ ముగించుకుని వచ్చేసరికి పరిస్థితి అంతా తలకిందులైంది. దీనికి కారణం ‘సైలెంట్ హీట్ స్ట్రెస్’ (Silent Heat Stress). ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని డాక్టర్లు చెబుతున్నారు. ఆ వ్యక్తి తల తిరుగుతూ, నీరసంగా ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్ ఓపీడీకి చేరుకున్నారు. అక్కడ ఆయనను పరీక్షించిన డాక్టర్ రొమ్మెల్ టిక్కూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. మొదట విపరీతంగా చెమటలు పట్టిన ఆ వ్యక్తికి, ఆ తర్వాత చెమట పట్టడం ఆగిపోయింది. దీని అర్థం.. శరీరం తనను తాను చల్లబరుచుకునే శక్తిని కోల్పోయిందని వైద్యులు గుర్తించారు. అలాగే “ఆ వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. క్రమంగా స్పృహ తప్పుతూ, నడవలేని స్థితిలో అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన గుండెపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. దీన్నే మనం ‘హీట్ స్ట్రోక్’ లేదా తీవ్రమైన ‘హీట్ స్ట్రెస్’ అని పిలుస్తామని డాక్టర్ రొమ్మెల్ టిక్కూ తెలిపారు. సైలెంట్‌ హీట్‌ స్ట్రెస్‌.. ఎందుకంత ప్రమాదం? డీటెయిల్‌గా చూద్దాం. సాధారణంగా మన శరీరం వేడిని తట్టుకోవడానికి చెమటను బయటకు పంపి చల్లబరుచుకుంటుంది. అయితే, తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఒకానొక దశలో శరీరంలోని ‘కూలింగ్ మెకానిజం’ విఫలమవుతుంది. అంటే, విపరీతంగా పట్టాల్సిన చెమట ఒక్కసారిగా ఆగిపోతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత లోపల విపరీతంగా పెరిగిపోయి అవయవాలపై ఒత్తిడి పడుతుంది. ఈ ‘సైలెంట్ హీట్ స్ట్రెస్’ వల్ల లోలోపలే శరీరం ఉడికిపోతుంది. ఇంట్లో ఉన్నా సరే ఒళ్లంతా సెగలు! బయట కనిపిస్తున్న ఎండ కంటే.. మీ ఒంట్లో సెగలు రేపుతున్న ఈ ‘సైలెంట్ హీట్ స్ట్రెస్’ చాలా డేంజర్‌. మీ ఇంట్లో ఏసీలో ఉన్నా, లేదా బయట చెట్ల నీడలో ఉన్నా సరే.. ఇది లోలోపలే మనిషిని ఉడికించేస్తుంది. ఇది గుండెపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. సాధారణంగా ఎండ దెబ్బ తగిలితే వెంటనే లక్షణాలు కనిపిస్తాయి, కానీ ఈ సైలెంట్ హీట్ స్ట్రెస్ లో శరీరం లోపల ఒత్తిడి పెరుగుతున్నా బయటికి వెంటనే తెలియదు. ఇక సైలెంట్ హీట్ స్ట్రెస్’ గురైన వారిలో కనిపించే లక్షణాలను చూస్తే.. నీరసంగా అనిపించడం, విపరీతంగా తల తిరగడం, వాంతులు వచ్చేలా ఉండటం, చెమట పట్టడం ఆగిపోవడం, స్పృహ తప్పడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ దీని లక్షణాలే. ఇందులో అత్యంత ప్రమాదకరమైన సూచన చెమటలు పట్టడం ఆగిపోవడం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ సంప్రదించడం చాలా మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అంటే బీపీ , షుగర్ , లేదా గుండె సమస్యలు ఉన్నవారికి ఇది త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తిని కోల్పోతుంది. కాబట్టి వయస్సు పైబడిన వారు మార్నింగ్‌ వాక్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఎండలో ఉన్నప్పుడు చెమట పట్టడం ఆగిపోయిందంటే, మీ శరీరం ప్రమాదంలో ఉందని అర్థం. కేవలం మధ్యాహ్నం మాత్రమే కాదు, ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా వృద్ధులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఉదయం వాకింగ్‌కు వెళ్లే సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ వేసవిలో ఉదయం 7-8 గంటలలోపే వాకింగ్ ముగించుకోవడం చాలా మంచిది. అదే విధంగా వాకింగ్ చేసేటప్పుడు వెంట వాటర్ బాటిల్ తప్పనిసరి. నీరసంగా అనిపిస్తే వెంటనే నీడలోకి వెళ్లి నీళ్లు తాగాలి. దాహం వేయకపోయినా తరచుగా నీరు, ఓఆర్ఎస్ , లేదా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. వేసవిలో ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiyaan Vikram: యంగ్ లుక్‌ కోసం రిస్క్‌ చేసిన విక్రమ్‌

షాకింగ్! మసాజ్ కోసం.. ఏకంగా రూ.7.25 లక్షలు ఖర్చు చేసిన హీరోయిన్..

Follow Us